Personal Loan Interest Rates: ఈ ప్రపంచంలో, డబ్బు అవసరం లేని వ్యక్తి ఎవరూ ఉండరు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, ఆర్థికావసరం తీర్చుకోవడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లోన్‌ కోసం ప్రతి వ్యక్తి బ్యాంక్‌ గడప తొక్కాల్సి వస్తుంది.


బ్యాంక్‌ లోన్‌ రకాలు
బ్యాంక్‌ లోన్లలో... హోమ్‌ లోన్‌, కార్‌ లోన్‌, టూ వీలర్‌ లోన్‌, బిజినెస్ లోన్‌, పర్సనల్‌ లోన్‌, గోల్డ్‌ లోన్‌ ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటిని రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి సెక్యూర్డ్‌ లోన్స్‌ (Secured Bank Loans), రెండు అన్‌ సెక్యూర్డ్‌ లోన్స్‌ (Unsecured Bank Loans). సెక్యూర్డ్‌ బ్యాంక్‌ లోన్‌ అంటే, ఏదో ఒక ఆస్తిని తనఖా పెట్టుకుని బ్యాంక్‌ ఇచ్చే లోన్‌. తనఖా ఉంటుంది కాబట్టి, ఈ రకమైన లోన్ల మీద వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. రెండోది దీనికి పూర్తిగా భిన్నం. అన్‌-సెక్యూర్డ్‌ లోన్లను ఎలాంటి తనఖా లేకుండా, కేవలం నమ్మకం మీద ఆధారపడి బ్యాంక్‌ ఇస్తుంది. ఈ రకమైన లోన్ల మీద వసూలు చేసే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అన్‌-సెక్యూర్డ్‌ లోన్‌కు ఉదాహరణ పర్సనల్‌ లోన్‌ (Personal loan).


మన దేశంలోని అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి. బ్యాంక్‌ అడిగిన అన్ని డాక్యుమెంట్లను కస్టమర్‌ సమర్పిస్తే, కేవలం ఐదు నిమిషాల్లో లోన్‌ మంజూరు అవుతోంది. ఇది, పండుగ సీజన్‌. ఈ టైమ్‌లో వివిధ అవసరాల కోసం పర్సనల్‌ లోన్లు తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. వ్యక్తిగత రుణం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు, నేరుగా బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు మంచి క్రెడిట్‌ స్కోర్‌ (720 పైన) ఉంటే, వడ్డీ విషయంలో బేరం ఆడే అవకాశం కూడా ఉంటుంది. 


ప్రస్తుత ఫెస్టివ్‌ సీజన్‌లో, పర్సనల్‌ లోన్ల కోసం కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్‌ ఫీజులతో స్పెషల్‌ స్కీమ్స్‌ అమలు చేస్తున్నాయి. మీకు పర్సనల్‌ లోన్‌ అవసరం అయితే, అప్లై చేయడానికి ముందు వివిధ బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు వసూలు చేస్తున్న ఇంట్రెస్ట్‌ రేట్ల గురించి తెలుసుకోవడం మంచిది.


పర్సనల్‌ లోన్‌ మీద వివిధ బ్యాంక్‌లు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు:


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర --------  వడ్డీ రేటు 9.75% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 1% వరకు
HSBC బ్యాంక్  -------- వడ్డీ రేటు 9.99% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 2% వరకు
ఇండస్ఇండ్ బ్యాంక్  -------- వడ్డీ రేటు 10.25% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 3% నుంచి
బ్యాంక్ ఆఫ్ ఇండియా  -------- వడ్డీ రేటు 10.25% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 2% వరకు
యాక్సిస్‌ బ్యాంక్‌ -------- వడ్డీ రేటు 10.49% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 2% వరకు
IDFC ఫస్ట్ బ్యాంక్  --------  వడ్డీ రేటు 10.49% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 3.50% వరకు
HDFC బ్యాంక్  -------- వడ్డీ రేటు 10.50% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 2.50% వరకు
IDBI బ్యాంక్  -------- వడ్డీ రేటు 10.50% --------- ప్రాసెసింగ్‌ ఫీజు బ్యాంకు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది
కరూర్ వైశ్యా బ్యాంక్  -------- వడ్డీ రేటు 10.50% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 1.5% నుంచి
ICICI బ్యాంక్‌ -------- వడ్డీ రేటు 10.75% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 2.50% వరకు
బ్యాంక్ ఆఫ్ బరోడా -------- వడ్డీ రేటు 10.90% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 2% వరకు
యెస్ బ్యాంక్ --------  వడ్డీ రేటు 10.99% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 2% వరకు
కోటక్ మహీంద్రా బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.99% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 3% వరకు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -------- వడ్డీ రేటు 11% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 1.50% వరకు
పంజాబ్ నేషనల్ బ్యాంక్  -------- వడ్డీ రేటు 11.40% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 1% వరకు
J & K బ్యాంక్‌ -------- వడ్డీ రేటు 12.30% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 1% వరకు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా -------- వడ్డీ రేటు 12.35% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 1% వరకు
సౌత్ ఇండియన్ బ్యాంక్  -------- వడ్డీ రేటు 12.85% --------- ప్రాసెసింగ్‌ ఫీజు 2% వరకు
RBL బ్యాంక్ 14% -------- వడ్డీ రేటు 3.5% ---------  ప్రాసెసింగ్‌ ఫీజు 3.5% వరకు
కర్ణాటక బ్యాంక్ -------- వడ్డీ రేటు 14.23% --------- ప్రాసెసింగ్‌ ఫీజు బ్యాంకు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది


ఈ నెల 13వ తేదీ నాటికి ఉన్న సమాచారం ఇది. పైన చెప్పినవి బ్యాంకులు వసూలు చేసే అత్యల్ప వడ్డీ రేట్లు మాత్రమే, గరిష్ట వడ్డీ రేట్లు కాదు. బ్యాంక్‌ నిర్ణయాలను బట్టి వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజ్‌ పర్సంటేజీ మారవచ్చు. లోన్‌ తీసుకోవాలనుకున్న వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌, చేసే పని, వయసును బట్టి కూడా వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంది.