Name Change in PAN Card: ఆధార్ కార్డ్ లాగే పాన్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇన్‌కమ్ టాక్స్, వ్యక్తిగత గుర్తింపు సహా చాలా పనులకు ఈ కార్డ్ ఉపయోగపడుతుంది. ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి ఈ 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్ (అంకెలు, ఆంగ్ల అక్షరాలు కలిగినది) చాలా ముఖ్యం.
అయితే, ఈ తరహా డాక్యుమెంట్ల మీద కొన్నిసార్లు పేర్లు మారిపోతుంటాయి, లేదా రాంగ్ స్పెల్లింగ్ వస్తుంది. దీనివల్ల, ఒకే వ్యక్తికి చెందిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌లోని పేర్లు మ్యాచ్ కావు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు.. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలనుకుంటే, ఈ రెండు డాక్యుమెంట్‌లలోని వివరాలు ఓకేలా ఉండాలి. లేదంటే ఆధార్-పాన్ అనుసంధానం ఫెయిల్ అవుతుంది. ఈ ఇబ్బందులను తప్పించుకోవాలంటే మీ పాన్ కార్డ్‌లోని పేరును సవరించాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డ్‌లో ఉన్న మీ పేరు కరెక్ట్ చేయడానికి ఉన్న సులభమైన మార్గాలలో ఒకటి.. మీ ఆధార్ కార్డ్‌ను ఉపయోగించడం.
ఆధార్ కార్డ్ ప్రకారం పాన్ కార్డ్‌లో పేరు మార్చుకోవాలనుకుంటే ఫాలో కావలసిన స్టెప్స్:
స్టెప్ 1: https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లింక్ ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. PAN Card Servicesపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Change/Correction in PAN Cardపై క్లిక్ చేయండి.
స్టెప్ 2: PAN డేటాలో మార్పు/కరెక్షన్ కోసం అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 3: వివరాలను నమోదు చేసి, continueపై క్లిక్ చేయండి (టోకెన్ నంబర్ గుర్తు పెట్టుకోండి). అక్కడ.. ఫిజికల్ (భౌతికంగా డాక్యుమెంట్స్ పంపడం); డిజిటల్‌గా eKYC & Esign సబ్మిట్ చేయడం అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకదానిని ఎంచుకోండి.
స్టెప్ 4: ఆధార్ బేస్‌డ్ e-KYC ఆప్షన్ ఎంచుకునే బాక్స్‌ను సూచించే Yes మీద క్లిక్ చేయండి (ఇక్కడ, ఆధార్ ప్రకారం అన్ని వివరాలు అప్‌డేట్ అవుతాయి). తర్వాత Save మీద క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీ పాన్‌ను నమోదు చేయండి. అప్‌డేట్ అయిన తర్వాత, ఫిజికల్ పాన్ కార్డ్ & ఈ-పాన్ రెండూ కావాలా, లేదా ఈ-పాన్ మాత్రమే కావాలా అన్న ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒక ఆప్షన్ ఎంచుకోండి.
స్టెప్ 6: మీ ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను నమోదు చేయాలి. మీ ఆధార్ కార్డ్‌పై ఉన్న సేమ్ ఫొటోనే పాన్ కార్డ్‌పైనా ప్రింట్ చేయాలా, వద్దా అన్న ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకోండి.
స్టెప్ 7: మీ ఆధార్ కార్డ్ ప్రకారం మీ పేరును నమోదు చేయండి.
స్టెప్ 8: అన్ని ప్రాథమిక వివరాలు ఫిల్ చేయండి, అవసరమైన పేమెంట్ చేయండి.
స్టెప్ 9: పేమెంట్ ప్రక్రియ విజయవంతం అయిన తర్వాత, స్క్రీన్‌పై రసీదు కనిపిస్తుంది. 'కంటిన్యూ'పై క్లిక్ చేయండి.
స్టెప్ 10: UIDAI సర్వర్ నుంచి ఆధార్ అథెంటికేషన్ జరుగుతుంది.
స్టెప్ 11: ఆధార్ అథెంటికేషన్ OTPని మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. OTPని ఎంటర్ చేసిన తర్వాత UIDAI డేటాబేస్‌లో ఉన్న మీ చిరునామా PAN ఫామ్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. దానిని ఓకే చేయడం.
స్టెప్ 12: డిటెల్స్ మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకుని, submit చేయండి.
మీ ఆధార్‌లోని ఈ-సంతకాన్ని ఉపయోగించి అప్లికేషన్‌పై ఈ-సైన్ చేయడానికి మీకు మరొక OTP వస్తుంది. దానిని ఉపయోగించండి.
ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ పాన్‌లో కరెక్షన్స్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ మోడ్ కోసం, మీరు సమీపంలోని పాన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి తగిన ఫామ్ సబ్మిట్ చేయండి.
కొత్త పాన్ కార్డ్/పాన్ డేటాలో మార్పుల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్స్:
ప్రొటీన్ ద్వారా చేయాలంటే ఆన్‌లైన్ లింక్: https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html
UTIITSL ద్వారా చేయాలంటే ఆన్‌లైన్ లింక్: https://www.myutiitsl.com/PAN_ONLINE/CSFPANApp
PDF డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ లింక్: https://www.incometaxindia.gov.in/Documents/form-for-changes-in-pan.pdf
మరో ఆసక్తికర కథనం: బ్యాంకులకు ఇవాళ బక్రీద్ సెలవు, మీ పని రేపు పెట్టుకోండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial