MSSC Scheme: మహిళలు, బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. తాజాగా, 2023 బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance  Minister Nirmala Sitharaman) మరొక పథకాన్ని ప్రతిపాదించారు. ఆ పథకం పేరు 'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్'. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 


కేంద్ర మహిళ & శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani), పార్లమెంట్ స్ట్రీట్‌లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి 'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్' పథకం కింద ఒక ఖాతా తెరిచారు.


లైన్‌లో నిలబడి ఖాతా ప్రారంభం
నిన్న (బుధవారం ఏప్రిల్ 26). సామాన్య ప్రజల మాదిరిగానే పోస్టాఫీసు వద్ద వరుసలో నిలబడి స్మృతి ఇరానీ ఈ ఖాతా తెరిచారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత, ఖాతా పాస్‌బుక్‌ను పోస్టాఫీసు సిబ్బంది కేంద్ర మంత్రికి అందించారు. మహిళలు, బాలికలు అత్యధిక సంఖ్యలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  


'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్' ఖాతా తెరిచిన తర్వాత, దానికి సంబంధించిన కొన్ని చిత్రాలను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా కేంద్ర మంత్రి పంచుకున్నారు.






 


మహిళల ప్రారంభించిన కోసం చిన్న మొత్తాల పొదుపు పథకం  
'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్' పథకం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. కేవలం మహిళలు, బాలికలకు మాత్రమే ఈ స్కీమ్‌ పరిమితం. మహిళ లేదా బాలిక ఈ పథకంలో కనిష్టంగా రూ. 100 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. పెట్టుబడిదార్లు 7.5 శాతం వడ్డీని పొందుతారు. వడ్డీని, కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి లెక్కించి ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది స్వల్పకాలిక పొదుపు పథకం, కాల పరిమితి కేవలం రెండు సంవత్సరాలు. ఈ కాల పరిమితిని పెంచుకోవడానికి లేదు. మీరు ఏప్రిల్ 2023లో ఖాతాను తెరిస్తే, ఈ పథకం మెచ్యూరిటీ ఏప్రిల్ 2025లో ఉంటుంది. ఖాతా ఓపెన్‌ చేసిన ఒక  సంవత్సరం తర్వాత, ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తం నుంచి కొంత డబ్బును ఉపసంహరించుకోవచ్చు.


ఈ ఖాతాను ఎలా ప్రారంభించాలి?
ఈ పథకం కింద పెట్టుబడికి వయోపరిమితి లేదు, ఏ వయస్సు మహిళలైన డబ్బు జమ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ లాగా దీనిని రూపొందించారు. ఈ పథకం కింద ఏ పోస్టాఫీసు లేదా ఏదైనా బ్యాంకు శాఖలోనైనా ఖాతా తెరవవచ్చు.