Income Tax Deadlines: డిసెంబర్ నెల పన్ను చెల్లింపుదారులకు కీలకం. ఎందుకంటే ఈ సమయంలోనే ఆదాయపు పన్నుకు సంబంధించిన పలు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా రిటర్న్‌లు (ITR) దాఖలు చేయడం నుంచి TDS, అడ్వాన్స్ టాక్స్ చెల్లించడం వంటి అనేక పనులతో ట్యాక్స్ పేయర్లకు ఇది కీలక సమయం. డిసెంబర్‌లో నిర్ణీత గడువులోపు పన్ను చెల్లింపుదారులు పెండింగ్ పనులు పూర్తి చేయాలి. మీరు ఏ ముఖ్యమైన పనిని మరిచిపోకుండా పూర్తి చేయాలో వాటి గురించి ఇక్కడ పూర్తి సమాచారం ఇస్తున్నాము.

Continues below advertisement

డిసెంబర్ 10

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ITR దాఖలు చేయడానికి చివరి తేదీని అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 10, 2025 వరకు పొడిగించింది. తమ ఖాతాలను ఆడిట్ చేయించుకోవాల్సిన వారికి ఇది వర్తిస్తుంది. పన్ను చెల్లింపుదారులు (Tax Payers)తో పాటు చార్టర్డ్ అకౌంటెంట్లు (CA), వివిధ వృత్తిపరమైన సంస్థల నుండి నిరంతరం డిమాండ్  రావడంతో డిసెంబర్ 10 వరకు పొడిగించారు. 

ఈ పరిస్థితిలో, డిసెంబర్ 10 తేదీ వరకు దాఖలు చేసిన రిటర్న్‌లను సకాలంలో ఫైల్ చేసిన రిటర్న్‌లకు సమానంగా పరిగణిస్తారు. దీనిపై ఎలాటి లేట్ ఫీజు లేదా జరిమానా విధించరు. దీని తర్వాత రిటర్న్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F కింద Late Fess చెల్లించాలి. ఇది ఆదాయం, దాఖలు తేదీ ఆధారంగా రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు ఉండవచ్చు.

Continues below advertisement

డిసెంబర్ 15

డిసెంబర్ 15 నాటికి నవంబర్ 2025లో అందుకున్న ఫారం 27Cని టాక్స్ పేయర్లు అప్‌లోడ్ చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా చలాన్ లేకుండా చెల్లించిన TDS, TCS కోసం ఫారం 24Gని సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు, అసెస్‌మెంట్ సంవత్సరం 2026–27 కోసం అడ్వాన్స్ టాక్స్ 3వ వాయిదా చెల్లించాలి. 

అక్టోబర్‌లో సెక్షన్ 194-IA, 194-IB, 194M సహా 194S కింద కట్ అయిన ట్యాక్స్ తిరిగి పొందడం కోసం TDS సర్టిఫికెట్‌లను కూడా ఇదే తేదీలోపు జారీ చేయాలి. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు నవంబర్‌లో చేసిన క్లయింట్ కోడ్ మార్పుల కోసం ఫారం 3BBని సబ్మిట్ చేయాలి.

డిసెంబర్ 30

డిసెంబర్ 30న కూడా పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ సంబంధించిన పలు ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి. గుర్తించిన లేదా గుర్తింపు పొందిన సంఘాలు నవంబర్ నెలకు తమ క్లయింట్ కోడ్ మార్పు ప్రకటనను ఫైల్ చేయాలి. దీనితో పాటు, నవంబర్‌లో TDS కట్ అయిన పన్ను చెల్లింపుదారులు ఈ రోజు వరకు TDS చలాన్-కమ్-ప్రకటనను సబ్మిట్ చేయాలి. ఇది నెలలో చేసిన అన్ని తగ్గింపులు సరిగ్గా నివేదించి, లెక్కించారని నిర్ధారిస్తుంది. మీరు ఏదైనా అంతర్జాతీయ సమూహంలో భాగమైతే లేదా విదేశీ కంపెనీ రెసిడెంట్ కాన్‌స్టిట్యూయంట్ ఎంటిటీ అయితే ఫారం 3CEADని సమర్పించాలి.

డిసెంబర్ 31

డిసెంబర్ 31, 2025 అసెస్‌మెంట్ సంవత్సరం 2025–26 కోసం ఆలస్యంగా లేదా మారిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీగా గుర్తుంచుకోవాలి. జూలై- సెప్టెంబర్‌లో ITR దాఖలు చేయడానికి చివరి తేదీలోగా చేయకపోతే.. ఇది మీకు చివరి అవకాశం. డిసెంబర్ నెల ట్యాక్స్ పేయర్లకు చాలా ముఖ్యం. ఈ సమయంలో ITR, TDS,  అడ్వాన్స్ టాక్స్ వంటి ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. కొంచెం పొరపాటు జరిగినా, జరిమానా కట్టాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో నోటీసులు కూడా వస్తాయి.