LIC AmritBaal Policy Details in Telugu: సమాజంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తికి బీమా రక్షణ ఉండాలి, ఇందుకోసం చాలా రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా, బీమా రక్షణకు అదనంగా మరికొన్ని బెనిఫిట్స్‌ను కూడా బీమా సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. 


ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC), కొత్త బీమా ప్లాన్‌ 'అమృత్‌బాల్‌'ను ఈ నెల 17వ (ఫిబ్రవరి 17, 2024) మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బీమా పాలసీ ఇది. ఇది, LIC ప్లాన్‌ నంబర్‌ 874.  


అమృత్‌బాల్‌ పథకం ఎందుకోసం?                             
మీ పిల్లల ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం ఇప్పుట్నుంచే పెట్టుబడి పెట్టాలని మీరు ప్లాన్‌ చేస్తుంటే, LIC అమృత్‌బాల్ పథకం గురించి ఆలోచించవచ్చు. ఇందులో, పిల్లలకు జీవిత బీమాతో పాటు, రాబడికి హామీ (Guaranteed Return) కూడా లభిస్తుంది. 


13 ఏళ్లలోపు పిల్లల కోసం..                  
ఈ పాలసీని 30 రోజుల నుంచి 13 ఏళ్ల లోపు పిల్లల కోసం తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ గడువు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ పాలసీ కోసం 5 లేదా 6 లేదా 7 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్ట ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు. ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి కట్టేలా, సింగిల్ ప్రీమియం పేమెంట్‌ ఆప్షన్‌ను ‌(Single premium payment option) కూడా ఎంచుకోవచ్చు. 


అమృత్‌బాల్‌ పాలసీ కింద కనిష్టంగా రూ. 2 లక్షల బీమా కవరేజ్‌ తీసుకోవాలి. మెచ్యూరిటీ సెటిల్‌మెంట్‌ను 5వ, 10వ లేదా 15వ సంవత్సరంలో మనీ బ్యాక్ ప్లాన్‌లాగా తీసుకోవచ్చు.


ఈ చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో, మీరు కట్టే ప్రీమియంలో ప్రతి రూ.1000కి రూ.80 చొప్పున గ్యారెంటీడ్‌ రిటర్న్‌ పొందొచ్చు. ఈ 80 రూపాయలు బీమా పాలసీ మొత్తానికి యాడ్‌ అవుతుంది. మీ బిడ్డ పేరు మీద రూ.1 లక్ష బీమా తీసుకుంటే, ఆ మొత్తానికి ఎల్‌ఐసీ రూ.8000 జోడిస్తుంది. ఈ డబ్బు ప్రతి సంవత్సరం చివరిలో యాడ్‌ అవుతుంది. పాలసీ చెల్లుబాటులో ఉన్నంత వరకు ఈ రిటర్న్ మీ పాలసీకి కలుస్తూనే ఉంటుంది.


అమృత్‌బాల్‌ పాలసీలో ఇతర ప్రయోజనాలు                
అమృత్‌బాల్‌ పాలసీలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే.. పాలసీ మెచ్యూరిటీ సమయంలో సమ్ అష్యూర్డ్ + గ్యారెంటీడ్‌ రిటర్న్‌ కలిపి పొందుతారు. పాలసీ కొనుగోలుదారుకు 'సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్' ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, కొంచెం అదనపు ప్రీమియం చెల్లిస్తే, ప్రీమియం రిటర్న్ రైడర్‌ను కూడా పొందొచ్చు. ఈ రైడర్‌ వల్ల బీమా రక్షణ మరింత పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: PPO నంబర్‌ పోయినా కనిపెట్టడం చాలా సులభం, పెన్షనర్లకు టెన్షన్ ఉండదిక!