LIC Bima Ratna Plan: దేశంలో అతి పెద్ద బీమా పాలసీ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation), దేశంలోని ప్రతి జనాభా విభాగానికి అనుకూలంగా వివిధ రకాల పథకాలను (LIC Policy) తీసుకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు, LIC బీమా రత్న పాలసీ (LIC Bima Ratna Plan) గురించి చెప్పబోతున్నాం. మీరు ఈ ప్లాన్‌లో 2 రెట్లు రాబడిని కూడా పొందవచ్చు. దీంతో పాటు, ఈ పాలసీలో మొత్తం 3 ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ ప్లాన్‌ మీకు ఉపయోగపడుతుందని అవుతుందనిపిస్తే, ఇందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.            


LIC బీమా రత్న ప్లాన్ ప్రయోజనాలు    
LIC ధన్ రత్న ప్లాన్‌లో (LIC Bima Ratna Plan) పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ డిపాజిట్‌ మొత్తం కంటే కొన్ని రెట్ల ఎక్కువ డబ్బును తిరిగి పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ పథకంతో అనుసంధానించిన - మనీ బ్యాక్, గ్యారెంటీడ్ బోనస్, డెత్ బెనిఫిట్ - 3 ప్రయోజనాలను మీరు పొందుతారు.     


LIC బీమా రత్న ప్లాన్ వివరాలు               
రక్షణ & పొదుపును మిళితం చేసే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిటింగ్, వ్యక్తిగత పొదుపునకు సంబంధించిన జీవిత బీమా ప్లాన్‌ ఈ LIC బీమా రత్న పాలసీ. ఈ పాలసీని 2022 మే 27న ప్రారంభించారు. LIC బీమా రత్న ప్లాన్‌లో, మీరు పాలసీ వ్యవధి ప్రకారం ప్రయోజనాలు పొందుతారు. ఈ పాలసీ కాల పరిమితి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 15 ఏళ్ల పాలసీ సమయంలో.. 13వ సంవత్సరం, 14వ సంవత్సరంలో 25% మొత్తం మీకు తిరిగి వస్తుంది. అదే విధంగా, 20 సంవత్సరాల పాలసీ సమయంలో.. 18వ సంవత్సరం, 19వ సంవత్సరంలో 25% మొత్తం చేతికి వస్తుంది. అదే విధంగా 25 సంవత్సరాల పాలసీలో... ఈ పని 23వ సంవత్సరం, 24వ సంవత్సరంలో జరుగుతుంది. 


ఈ పాలసీలో, మొదటి 5 సంవత్సరాల్లో ప్రతి రూ. 1000పై ఖచ్చితంగా రూ. 50 బోనస్ పొందుతారు. ఆ తర్వాతి 5 సంవత్సరాల్లో, అంటే 6 నుంచి 10 సంవత్సరాల మధ్య, ప్రతి రూ. 1000 కి ఈ బోనస్‌ రూ. 55 అవుతుంది. ఆ తర్వాత, 11 నుంచి 25 సంవత్సరాల్లో, ప్రతి రూ. 1000పై ఈ బోనస్ రూ. 60 గా మారుతుంది.


మిగిలిన ముఖ్యమైన విషయాలు ఏంటి?              
ఎల్‌ఐసీ బీమా బీమా ప్లాన్‌లో పెట్టుబడికి ఉండాల్సిన కనీస వయస్సు 90 రోజులు, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.          
ఈ పథకంలో కనీస మొత్తం రూ. 5 లక్షలు అందుతుంది.     
బీమా రత్న యోజనలో నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులు చేయవచ్చు.
మీరు ఈ పాలసీని కనీస మొత్తం రూ. 5 లక్షలతో 15 సంవత్సరాల కాలానికి బీమా చేస్తే, పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి మీరు మొత్తం రూ. 9,12,500 పొందుతారు.