PPF Rate Hike Likely: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో (PPF) పెట్టుబడి పెట్టిన/పెట్టుబడి పెట్టబోతున్న వాళ్లు బిగ్‌ డీల్‌ను బ్యాగ్‌లో వేసుకునే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జులై-సెప్టెంబర్ కాలం) PPF వడ్డీ రేటు పెరగే ఛాన్స్‌ ఉంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను (small saving interest rates) ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షించనుంది. ఆ నిర్ణయాలను ఈ రోజు సాయంత్రం కల్లా ప్రకటించొచ్చు.


గత రెండేళ్లుగా, 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు PPF వడ్డీ రేటను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. PPF అకౌంట్స్‌ మీద ప్రస్తుతం ఏడాదికి 7.1 శాతం ఇంట్రెస్ట్‌ చెల్లిస్తున్నారు. విశేషం ఏంటంటే, సుకన్య సమృద్ధి యోజన (sukanya samriddhi yojana interest rate) సహా దాదాపు అన్ని స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం గత మూడు త్రైమాసికాలుగా పెంచుతూనే ఉంది, PPFను మాత్రం పక్కనబెట్టింది.


స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ వడ్డీ రేట్లు        
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ కాలం), చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటును 10 నుంచి 70 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇందులో NSC ఇంట్రెస్ట్‌ రేట్‌ (national saving certificate interest rate) 7 శాతం నుంచి 7.70 శాతానికి పెరిగింది. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం నుంచి 8 శాతానికి చేరింది. పెంచారు. ప్రస్తుతం, కిసాన్ వికాస్ పత్రపై (Kisan Vikas Patra interest rate) ఏటా 7.5 శాతం వడ్డీ అందుతోంది. అంతేకాదు, ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ వ్యవధిని 120 నెలల నుంచి 115 నెలలకు తగ్గించారు.        


దాదాపు అన్ని పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం, PPF వడ్డీ రేట్లను పెంచలేదు. కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ఏడాది వ్యవధిలో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు లేదా 2.50 శాతం పెంచింది. రెపో రేట్‌కు అనుగుణంగా అన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FDలు) వడ్డీ రేట్లను పెంచాయి. ఆ తర్వాత, కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. గత రెండేళ్లుగా PPFను పట్టించుకోలేదు కాబట్టి, ఈసారి ఈ స్కీమ్‌ ఇంట్రెస్ట్‌ రేట్‌ పెరుగుతుందని మార్కెట్‌ భావిస్తోంది.


పీపీఎఫ్ వడ్డీ రేటును 7.55 శాతానికి పెరిగే ఛాన్స్‌     
2016లో ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విధంగా, PPF వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం, 10 ఇయర్స్‌ బెంచ్‌మార్క్‌ బాండ్ ఈల్డ్‌ (10 year benchmark bond yield) కంటే 25 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీని పీపీఎఫ్‌ ఇన్వెస్టర్లకు చెల్లించాలి. ప్రస్తుతం 10 ఇయర్స్‌ బాండ్ ఈల్డ్ 7.3 శాతంగా ఉంది. ఈ ఫార్ములా ఆధారంగా పీపీఎఫ్ వడ్డీ రేటును 7.55 శాతానికి పెంచాలి.


మరో ఆసక్తికర కథనం: టాక్స్‌ పేయర్లకు ఫైనల్‌ కాల్‌, ఈరోజు మిస్సయితే ఇక ఛాన్స్‌ లేనట్లే! 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial