LIC Jeevan Anand Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation- LIC) భారతదేశంలో అతి పెద్ద & ప్రముఖ  జీవిత బీమా పాలసీ. దేశంలోని ప్రతి వర్గం ప్రజల కోసం ఎల్‌ఐసీ వివిధ పథకాలను ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి తీసుకొస్తూనే ఉంది. ఇవాళ, LIC పరిచయం చేస్తున్న మరొక పాలసీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్కీమ్‌లో మీరు పెట్టుబడి పెడితే, డబుల్ బోనస్ (Double Bonus) ప్రయోజనం పొందుతారు. 


డబుల్ బోనస్ అందించే ఆ పథకం పేరు జీవన్ ఆనంద్ పాలసీ. ఇది, ప్రీమియం టర్మ్ పాలసీ, దీనిలో నిర్దిష్ట కాలం వరకు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. 


జీవన్ ఆనంద్ పాలసీ పూర్తి వివరాలు:


ప్రతి రోజూ రూ. 45 పెట్టుబడి
జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా మీరు రూ. 25 లక్షల వరకు పొందాలని అనుకుంటే... మీరు ఈ పాలసీలో 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఈ పాలసీలో, మీరు 5 లక్షల హామీ మొత్తాన్ని పొందుతారు. ఇందుకోసం, మీరు ప్రతి నెలా రూ. 1,358 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. వార్షిక ప్రాతిపదికన రూ. 16,296 (నెలకు రూ. 1358 x 12 నెలలు) డిపాజిట్ చేయాలి. దీనిని ఇంకా సింపుల్‌గా చెప్పుకుంటే.. ప్రతి రోజూ మీరు కేవలం 45 రూపాయల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. 


ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. కనీస హామీ మొత్తం రూ. 1 లక్ష సంస్థ నుంచి అందుతుంది.


జీవన్ ఆనంద్ పాలసీ కోసం అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డ్ (Aadhaar Card)
బ్యాంకు ఖాతా (Bank Account)
మొబైల్ నంబర్ (Bank Account)
పాన్ కార్డ్ (PAN Card)


జీవన్ ఆనంద్ పాలసీలో రైడర్ బెనిఫిట్‌
జీవన్ ఆనంద్ పాలసీలో డెత్ బెనిఫిట్‌తో (Death Benefit) పాటు రైడర్ బెనిఫిట్ ‍(Rider Benefit) లభిస్తుంది. జీవన్ ఆనంద్ పాలసీ కవరేజ్‌ కొనసాగుతున్న సమయంలో, దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే, డెత్‌ బెనిఫిట్‌ కింద పాలసీదారుని నామినీకి 125% వరకు ఆర్థిక భరోసా లభిస్తుంది. కనీస హామీ మొత్తం కింద లక్ష రూపాయలకు తక్కువ కాకుండా, పాలసీ తీసుకున్న ధర ఆధారంగా ఆర్థిక మొత్తం నామినీకి అందుతుంది. 


రైడర్ బెనిఫిట్‌ కింద, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ ప్రయోజనాలు ఉంటాయి. 


రైడర్‌ బెనిఫిట్‌ అంటే?
రైడర్‌ బెనిఫిట్‌ అంటే యాడ్‌-ఆన్‌ కవరేజీ. సాధారణ పాలసీతో పాటు అదనపు కవరేజీ కోసం కొనుగోలు చేసే యాడ్‌-ఆన్‌ ఇది. ఈ యాడ్-ఆన్‌ కొనాలా వద్దా అన్నది పాలసీదారు ఇష్టం. రైడర్ వల్ల అదనపు కవరేజీ, ప్రమాదాల నుంచి అదనపు ఆర్థిక రక్షణను అందిస్తుంది. సముచిత రేట్లలో వీటిని కొనవచ్చు. అవి మీ ప్రధాన పాలసీని మరింత పటిష్టంగా, విస్తృతంగా మారుస్తాయి. పాలసీదారు ఎక్కువ బెనిఫిట్‌ అందేలా చేస్తాయి.


మిగిలిన LIC పథకాల్లా కాకుండా, ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఆదాయ పన్ను మినహాయింపు ఉండదు.