New Ticket Cancellation Refund Rules: భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రైలు టికెట్ రద్దు, రీఫండ్‌ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేసింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య దశలవారీగా అమలులోకి రానున్నాయి. 

రైల్వే టికెట్ క్యాన్సలేషన్ కోసం కొత్త రూల్స్ 

ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు నుంచి మాత్రమే రీఫండ్‌ స్లాట్లు లెక్కించే వారు. అయితే కొత్త సంస్కరణల ప్రకారం ఈ సమయాన్ని 72 గంటలకు పొడిగించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలంటే సమయాన్ని బట్టి రీఫండ్‌ పొందే విధానాన్ని రైల్వేశాఖ నాలుగు విభాగాలుగా విభజించింది. 

72 గంటల ముందు 

ప్రయాణానికి 72 గంటల కంటే ముందే కన్ఫామ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే కేవలం కనీస క్యాన్సలేషన్ ఛార్జీలు మాత్రమే మినహాయించి మిగిలిన పూర్తి మొత్తాన్ని ప్రయాణికులకు ఇచ్చేస్తారు. 

72 నుంచి 24 గంటల మధ్య 

రైలు బయల్దేరడానికి 72 గంటల ముందు నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే టికెట్ ధరలో 25శాతం మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. 

24 నుంచి 8గంటల మధ్య 

ప్రయాణ సమయాన్ని 24 గంటల ముందు నుంచి 8 గంటల వ్యవధిలో రద్దు చేసుకుంటే 50శాతం మాత్రమే తిరిగి ఇస్తారు. 

8 గంటల లోపు అయితే

రైలు బయల్దేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు లేదా రైలు వెళ్లిపోయిన తర్వాత టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ లభించదు. 

బోర్డింగ్ పాయింట్, ఇతర వెసులుబాట్లు

ప్రయాణికుల అవసరాలను గుర్తించిన రైల్వే శాఖ, బోర్డింగ్ పాయింట్‌ మార్చుకునే విషయంలో పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఇకపై ప్రయాణానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, వంటి మెట్రో నగరాల్లో ఒకే నగర పరిధిలో ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

అంతేకాకుండా, గతంలో కౌంటర్ టికెట్లను రద్దు చేసుకోవాలంటే రైలు ప్రారంభమయ్యే స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దేశంలోని ఏ రైల్వే స్టేషన్‌లోనైనా కౌంటర్ టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. ఈ టికెట్‌ ప్రయాణికులకు కూడా ఒక శుభవార్త చెప్పింది. ఇకపై టికెట్ డిపాజిటర్‌ రిసీట్‌ కోసం మాన్యువల్‌గా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం ఆటోమేటిగ్‌గా రీఫండ్ ప్రాసెస్ అవుతుంది. 

ఆధ్యాత్మిక పర్యాటకం- ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ 

దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర- అరుణాచలం- చిదంబరం పేరిటో 14,500ే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా అరుణాచలం, రామేశ్వేరం, కన్యాకుమారి వంటి ప్రముఖ క్షేత్రాలను సందర్శించవచ్చు.