Passive Income: నువ్వు నెల చివర్లో జీతం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటావు. కానీ, ఆ సంతోషం రెండు-మూడు రోజుల్లోనే పోతుంది. ఎందుకంటే  పాలు, పెట్రోల్, ఇంటి రెంటు, కరెంటు అన్నీ ధరలు పెరుగుతున్నాయి. నీ జీతం అలాగే ఉంటుంది. ఇలా కొనసాగితే ఎప్పటికీ ముందుకు వెళ్లలేం కదా? శేఖర్ 20 ఏళ్లుగా ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతను ఫ్రెండ్‌ రాము ఐటీ ఉద్యోగి. ఇద్దరూ నెలకు 50 వేలు సంపాదిస్తారు. కానీ అన్ని ఖర్చులు మిగిలిపోను చివరకు 5వేలు మిగులుతున్నాయి. ఆ ఐదు వేలతో మిగతా నెలంతా ఎలా బతాలి భవిష్యత్‌ కోసం ఎలా పొదుపు చేయాలనేది వారి ఆలోచన. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అందరి సమస్య. 

Continues below advertisement

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో పని చేసే వాళ్లు కూడా ఇదే అనుభవిస్తున్నారు. ఎందుకంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, కానీ వేజెస్ స్టాగ్నెంట్ 2023-24లో మగ వర్కర్ల రియల్ అవరేజ్ మంత్లీ వేజ్ 6.4% తగ్గి రూ.11,858కి చేరింది. ఇది మనల్ని ఒక ట్రాప్‌లో పడేస్తోంది. ప్యాసివ్ ఇన్‌కమ్ – అంటే నువ్వు పని చేయకుండా వచ్చే ఆదాయం. ఇప్పుడు ఉన్న సమస్యలకు ఇదే పరిష్కారం. 

ఇప్పుడు 2025లో SIPలు, REITలు, అల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా మన మిడిల్ క్లాస్ వాళ్లు ఈ ట్రాప్ నుంచి బయటపడవచ్చు. ఎలా? వాటి గురించి చూద్దాం. మొదట SIPలు – సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. నువ్వు ప్రతి నెల కొంచెం మొత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతావు. ఇది సులభం. ఇంట్లోనే కూర్చుని సిప్‌ స్టార్ట్ చేయవచ్చు. 10 ఏళ్లలో ఈక్విటీ ఫండ్స్ అవరేజ్ 12-15% రిటర్న్స్ ఇస్తాయి. కొన్ని ఫండ్స్ 24.6% వరకు ఇచ్చాయి. ఉదాహరణకు, నువ్వు నెలకు రూ.5,000 పెడితే, 10 ఏళ్ల తర్వాత దాదాపు రూ.13 లక్షలు కావచ్చు. ఇది మార్కెట్ రిస్క్‌తో వస్తుంది. కానీ లాంగ్ టర్మ్‌లో లాభాలను ఇస్తోంది. శేఖర్‌, రాము లాంటి వాళ్లు ఇది చేస్తే, రిటైర్‌మెంట్‌కు సహాయం అవుతుంది. 2024-25లో SIPలు ₹500 కంటే తక్కువ మొత్తాలతో 106% పెరిగాయి, చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా వస్తున్నారు. 

Continues below advertisement

ఇప్పుడు REITలు – రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్. ఇది పూర్తి ఆస్తి కొనకుండా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం. నువ్వు షేర్లలా కొని, డివిడెండ్స్ తీసుకుంటావు. 2025లో ఇండియన్ REITలు 6-7% డిస్ట్రిబ్యూషన్ యీల్డ్స్ ఇస్తున్నాయి, గ్లోబల్ బెంచ్‌మార్క్‌ల కంటే ఎక్కువ. రియల్టీ స్టాక్స్ 20% పడిపోయినా సరే ఒక సంవత్సరంలో 29% రిటర్న్స్ వరకు వచ్చాయి, హైదరాబాద్‌లో ఐటీ పార్కులు, మాల్స్‌లో ఇన్వెస్ట్ చేసి, నెలకు రెగ్యులర్ ఇన్‌కమ్ పొందవచ్చు.  

P2P లెండింగ్ – పీర్ టు పీర్. నువ్వు చిన్న బిజినెస్‌లకు లోన్ ఇస్తావు, ఇంట్రెస్ట్ తీసుకుంటావు. లెన్‌డెన్‌క్లబ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో 10-12% రిటర్న్స్ వస్తాయి. లోయర్ మిడిల్ క్లాస్‌కు FMPP (ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్), PPF, NPS మంచివి. PPFలో 7-8% గ్యారంటీడ్ రిటర్న్స్. 

ఆస్తి అద్దెకు ఇవ్వడం – నీ కార్ లేదా ఇంటి భాగాన్ని అద్దెకు ఇచ్చి సంపాదించవచ్చు. మెట్రో నగరాల్లో చాలామంది ఇలా చేస్తున్నారు, ఫెస్టివల్ సీజన్‌లో ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తుంది. 

స్టార్టప్ ఈక్విటీ కూడా సంపాదనకు మంచి ఆప్షన్, కానీ రిస్క్ ఎక్కువ. మొత్తంగా, 70:30 స్ట్రాటజీ – 70% ఈక్విటీ, 30% డెట్ – మిడిల్ క్లాస్‌కు సరిపోతుంది. ఈ విషయంపై ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ రోహన్ గోయల్, మిరా మనీ నుంచి, "4-5% విత్‌డ్రాయల్ రేట్‌తో రూ.1 లక్ష నెలవారీ ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం రూ.2.4-3 కోట్లు కావాలి" అని చెప్పాడు. 

వారెన్ బఫెట్ మాటలు గుర్తుందా? "నువ్వు నిద్రపోతున్నప్పుడు డబ్బు సంపాదించే మార్గం కనుక్కోకపోతే, మరణించే వరకు పని చేయాలి" అన్నాడు. మరో మంచి కోట్, ఇండియన్ బిలియనేర్ అజీమ్ ప్రేమ్‌జీ: "నువ్వు రిచ్ అవ్వడానికి సేవింగ్స్‌ను స్పెండింగ్ కంటే ఎక్కువ వాల్యూ చేయి." ఇవి మనకు ప్రేరణ.