Aadhaar Card: ఆధార్ కార్డు లేకపోతే మన రోజువారి పనులు చాలా ఆగిపోతాయి. చివరకు మీ మొబైల్ కూడా పని చేయడం మానేస్తుంది. అందుేక డిజిటల్ ఇండియా యుగంలో ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, దాదాపు ప్రతి పనికి చాలా ఉపయోగకరమైన పత్రం. బ్యాంకింగ్, సబ్సిడీలు, పెన్షన్లు, ట్యాక్స్ చెల్లింపు, సిమ్ ధృవీకరణ , డిజిలాకర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడానికి యాక్టివ్ ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ ముఖ్యం. అందువల్ల, మీ మొబైల్ నంబర్ మారినట్లయితే, దానిని మీ ఆధార్ కార్డులో అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. 

Continues below advertisement

మీరు కొత్త ఆధార్ యాప్‌లో చిరునామాను కూడా మార్చుకోవచ్చు.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు మీ ఇంటి నుంచే మీ ఆధార్ కార్డులోని చిరునామాను కూడా మార్చుకోవచ్చు. గతంలో, మీ మొబైల్ నంబర్ లేదా మీ ఆధార్ కార్డులోని చిరునామాను మార్చడానికి మీరు నమోదు కేంద్రానికి వెళ్లాల్సిన పని లేదు. అయితే, ఇప్పుడు, OTP ధృవీకరణ, ఫేస్‌ రికగ్నేషన్‌తో ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా మారింది.

కొత్త ఆధార్ యాప్ అనేది సురక్షితమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఇక్కడ మీరు మీ ఆధార్ సమాచారాన్ని సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. మేనేజ్ చేసుకోవచ్చు. అప్‌డేట్ చేసుకోవచ్చు. mAadhaar యాప్ గతంలో పరిమిత లక్షణాలను కలిగి ఉంది, కానీ ఈ కొత్త యాప్ మొబైల్ నంబర్ అప్‌డేట్‌లు, చిరునామా అప్‌డేట్‌తో సహా అనేక కీలక సర్వీస్‌లను యాడ్ చేసింది. ఇప్పుడు మీరు చిన్న అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రాల వద్ద ఎక్కువ క్యూలలో నిలబడవలసిన అవసరం లేదు. ఈ ప్రక్రియను మీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. ముఖ ప్రామాణీకరణ, OTP ధృవీకరణ ద్వారా పూర్తి చేయవచ్చు.

Continues below advertisement

దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే గుర్తింపు పత్రాలలో ఆధార్ ఒకటి. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, డిజిలాకర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లాగిన్ అవ్వడానికి OTP-ఆధారిత ధృవీకరణ అవసరం. మీరు మీ మొబైల్ నంబర్‌ను మార్చి ఉంటే, మీ సిమ్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే లేదా భద్రతా కారణాల దృష్ట్యా కొత్త నంబర్‌ను జోడించాలనుకుంటే, దానిని ఆధార్‌తో లింక్ చేయడం అవసరం. కొత్త ఆధార్ యాప్ ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది . సురక్షితంగా చేస్తుంది.

  • దశ 1: మీ Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లో కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
  • దశ 2: యాప్‌ను తెరిచి, రిజిస్టర్ చేసుకోవడానికి, లాగిన్ అవ్వడానికి మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో అందుకున్న OTPని ఉపయోగించి ధృవీకరించండి. తర్వాత, ఫేస్‌ రికగ్నేషన్‌ను ఉపయోగించి లాగిన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దశ 3: లాగిన్ అయిన తర్వాత, సేవల విభాగానికి వెళ్లి, మొబైల్ నంబర్ అప్‌డేట్ ఎంపికను ఎంచుకోండి.
  • దశ 4: తర్వాత, మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌ను కంటిన్యూ చేయండనే మేసేజ్ చేయండి. తర్వాత, మీ కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, OTPని పంపుపై క్లిక్ చేయండి.
  • దశ 5: మీ కొత్త నంబర్‌లో అందుకున్న OTPని నమోదు చేసి, ధృవీకరించు OTPపై క్లిక్ చేయండి.
  • దశ 6: తర్వాత, ఫేస్‌ రికగ్నేషన్‌పై ప్రెస్‌ చేయండి. స్క్రీన్‌పై చూపించిన బాక్స్‌లో మీ ఫేస్‌ను ఉంచండి. ఫోటోను క్యాప్చర్ చేయడానికి సర్కిల్ ఆకుపచ్చగా మారినప్పుడు కళ్లను బ్లింక్ చేయండి.
  • దశ 7: విజయవంతమైన ప్రామాణీకరణ తర్వాత, పేమెంట్‌ కన్ఫామ్‌పై క్లిక్ చేయండి. మీరు ఆన్‌లైన్‌లో ₹75 ప్రాసెసింగ్ రుసుము చెల్లించాలి.
  • దశ 8: మీరు ఇచ్చిన వివరాలతో కన్ఫర్మేషన్ మెసేజ్ అందుకుంటారు. మీ మొబైల్ నంబర్ సాధారణంగా 15 నుంచి 30 రోజుల్లోపు అప్‌డేట్ అవుతుంది.