Home Loan Tips: ఆర్థిక అవసరాలు, లేదా తక్కువ వడ్డీ రేట్ల ఆశతో చాలా మంది తమ హోమ్‌లోన్‌ను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంక్‌కు మారుస్తుంటారు. అయితే ఇలా ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ చేసేటప్పుడు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చాలా నష్టం జరుగుతుంది. పైకి కనిపించేత ఈజీ కాదీ ప్రక్రియ. ఇందులో ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఛార్జీలు, బ్యాంకుల అంతర్గత నిబంధనలు వంటి అనేక ఆర్థిక కోణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మీరు లోన్ అదే బ్యాంకులో అంతర్గతంగా మారుస్తున్నారా లేదా వేరే బ్యాంకుకు తరలిస్తున్నారా ఆనే దానిపై ఖర్చు ఆధారపడి ఉంటుంది. 

Continues below advertisement

వేరే బ్యాంకుకు లోన్ బదిలీ చేయడం 

మీరు ప్రస్తుతం బ్యాంకులో వడ్డీ ఎక్కువగా ఉందని భావించి వేరే బ్యాంకుకు మారినప్పుడు ఆ కొత్త బ్యాంకు దీనిని ఒక ప్రెష్‌లోన్‌ అప్లికేషన్‌గానే పరిగణిస్తున్నారు. దీని వల్ల కొన్ని ఖర్చులు తప్పనిసరి అవుతాయి. కొత్త క్లయింట్‌ను చేర్చుకోవడానికి బ్యాంక్‌ చేసే అడ్మనిస్ట్రేటివ్ పనుల కోసం మీరు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. కొత్త బ్యాంకు తన సొత డ్యూడిలిజెన్స్‌నిర్వహిస్తుంది. అంటే ఆస్తి పత్రాల చట్టపరమైన పరిశీలిన, ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేయడానికి సాంకేతిక మూల్యాంకనం చేస్తారు. ఈ ఖర్చులన్నీ కొనుగోలుదారుడే భరించాలి. ఆస్తిపై ఎటువంటి వివాదాలు లేవని నిర్దారించుకోవడానికి కొత్త ఎన్‌కంబ్రాన్స్‌ సర్టిపికెట్ అంటే ఈసీ, ఇతర చట్టపరమైన వెరిఫికేషన్లు కోసం అదనపు ఖర్చులు అవుతాయి. 

అదే బ్యాంకులో అంతర్గత బదిలీ చేస్తే...

ఒక వేళ మీరు విక్రేత ఇప్పటికే లోన్ తీసుకున్న అదే బ్యాంకును ఎంచుకుంటే ఆ ప్రక్రియ చాలా వేగంగా పూర్తి అవుతుంది. తక్కువ ఖర్చు అవుతుంది. సదరు ఆస్తికి సంబంధించిన అసలు పత్రాలు ఇప్పటికే బ్యాంకు వద్ద ఉంటాయి. కాబట్టి బ్యాంక్‌ ఆస్తిని మళ్లీ మొదటి నుంచి వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం మీ ఆర్థిక అర్హత మాత్రమే చెక్ చేస్తారు. ఆస్తి మూల్యాంకనం ఇప్పటికే రికార్డుల్లో ఉన్నందున బ్యాంక్ తన విచక్షణ మేరకు కొన్ని లీగల్, అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయించే అవకాశం ఉంది. వేర్వేరు బ్యాంకుల మధ్య భౌతికంగా పత్రాల మార్పిడి జరగాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది సమాయాన్ని బాగా ఆదా చేస్తుంది. 

Continues below advertisement

ఫీజులను ప్రభావితం చేసే ఇతర అంశాలు 

ఏ బ్యాంకును ఎంచుకున్నా, తుది ఖర్చును కొన్ని ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. మీ క్రెడిట్ స్కోరు, ఆదాయ ప్రొఫైల్‌ బాగుంటే, ప్రాసెసింగ్‌ ఫీజులు సర్దుబాటు చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. కొత్త లోన్ వడ్డీ రేటు అనేది ప్రస్తుత ఎంసీఎల్‌ఆర్‌, ఆర్థిక స్థితిగతులపై ఆధారంగా నిర్ణయించబడే స్ప్రెడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ ఆస్తి వ్యాపార అవసరాల కోసం లేదా నివాసేతర అవసరాల కోసం బదిలీ చేస్తుంటే విక్రేత సుమారు మూడు శాతం వరకు ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ఇది పరోక్షంగా డీల్ మొత్తం ఖర్చుపై ప్రభావం చూపుతుంది. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం వేరే బ్యాంక్ తక్కువ వడ్డీరేటు ఆఫర్ చేసినప్పుడు వెంటనే మారిపోకూడదు. వడ్డీ వల్ల కలిగే పొదుపు మొత్తం మీరు ముందుగా చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోవాలి.