GPay Features:   డిజిటల్ చెల్లింపుల రంగంలో గూగుల్ పే  మరో విప్లవాత్మక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాలంటే ఆ ఫోన్ నంబర్‌కు బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉండాలి. కానీ, ఇప్పుడు యూపీఐ సర్కిల్  (UPI Circle) అనే ఫీచర్ ద్వారా మీ దగ్గర ఉన్న రెండో ఫోన్‌కు లేదా మీ కుటుంబ సభ్యుల ఫోన్‌కు ఎటువంటి బ్యాంకు ఖాతా లేకపోయినా, మీ మెయిన్ అకౌంట్ నుంచే వారు సులభంగా నగదు చెల్లింపులు చేయవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, ఇది మీ మెయిన్ బ్యాంకు అకౌంట్‌ను రెండో ఫోన్‌కు  ఎక్స్‌టెన్షన్  చేయడమే.

Continues below advertisement

 పాకెట్ మనీ - పూర్తి నియంత్రణ

యూపీఐ సర్కిల్‌లో సెట్ అప్ పాకెట్ మనీ  (Set up Pocket Money) అనే ఆప్షన్ ద్వారా మీరు మీ రెండో ఫోన్‌కు ఒక పరిమితిని నిర్ణయించవచ్చు. నెలకు గరిష్టంగా  15,000 వరకు మీ అనుమతి అవసరం లేకుండానే రెండో ఫోన్ ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. అంటే, షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, ఆన్‌లైన్ పేమెంట్స్ లేదా ఉబెర్ వంటి యాప్స్‌లో రైడ్ బుక్ చేయడం వంటివి రెండో ఫోన్‌తోనే సొంతంగా చేసుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా  5,000 వరకు లిమిట్ సెట్ చేసుకునే అవకాశం ఉండటం వల్ల భద్రతకు కూడా ఢోకా ఉండదు.

Continues below advertisement

 అత్యవసర సమయాల్లో అద్భుతమైన బ్యాకప్ 

చాలా సార్లు మన మెయిన్ ఫోన్ పగిలిపోవడమో, రిపేర్ అవ్వడమో లేదా బ్యాటరీ అయిపోవడమో జరుగుతుంటుంది. అటువంటి కీలక సమయాల్లో గూగుల్ పే అకౌంట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడకుండా, ఈ రెండో ఫోన్ ఒక డిజిటల్ బ్యాకప్ సిస్టమ్‌లా పనిచేస్తుంది. మెయిన్ ఫోన్ అందుబాటులో లేకున్నా, రెండో ఫోన్ ద్వారా మీ బ్యాంకు ఖాతాలోని డబ్బును వాడుకోవచ్చు. ఒక్క నిమిషం కూడా పేమెంట్స్ కోసం ఎవరినీ అడగాల్సిన పనిలేకుండా, మీ పనులు సజావుగా సాగిపోతాయి.

 సెటప్ చేయడం ఎలా? 

ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం. మీ గూగుల్ పే యాప్‌లో ప్రొఫైల్ సెక్షన్  లోకి వెళ్ళండి. అక్కడ కనిపిస్తున్న  UPI Circle ఆప్షన్‌ను ఎంచుకుని, Set up Pocket Money  పై క్లిక్ చేయండి. మీ రెండో ఫోన్ నంబర్‌ను యాడ్ చేసి, నెలవారీ ఖర్చుల పరిమితిని సెట్ చేస్తే సరిపోతుంది. ఆ రెండో ఫోన్‌లో కూడా గూగుల్ పే యాప్ ఉంటే చాలు, దానికి విడిగా యూపీఐ పిన్ గానీ, బ్యాంకు ఖాతా గానీ అవసరం లేదు. కేవలం మొబైల్ లాక్ లేదా బయోమెట్రిక్ ద్వారానే చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ సర్కిల్ అనేది కేవలం సౌలభ్యం మాత్రమే కాదు, అదనపు భద్రత , స్వేచ్ఛను కూడా ఇస్తుంది. ఇంట్లోని పిల్లలకు నెలకు కొంత పాకెట్ మనీ కేటాయించాలన్నా, లేదా స్మార్ట్‌ఫోన్ వాడకం పెద్దగా తెలియని వృద్ధులకు సులభంగా నగదు అందజేయాలన్నా ఇది ఒక అద్భుతమైన మార్గం. మీ రెండో ఫోన్‌ను ఇప్పటి వరకు కేవలం కాల్స్ లేదా వీడియోల కోసమే వాడుతుంటే, వెంటనే ఈ ఫీచర్‌ను సెట్ చేసుకుని దానిని ఒక శక్తివంతమైన డిజిటల్ వాలెట్‌గా మార్చుకోండి.