Gold Silver Prices Today: మన దేశంలో బంగారం అంటే కేవలం అలంకరణ లోహం మాత్రమే కాదు, సంప్రదాయం & పెట్టుబడి కూడా. భారతీయుల విశ్వాసాలు, మనోభావాలతో పసిడి ముడిపడి ఉంది. ప్రపంచంలో అత్యధికంగా పుత్తడి దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ప్రజలు బంగారాన్ని ఒక ఉత్తమ పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. కాలక్రమేణా, బంగారంలో పెట్టుబడి పెట్టే పద్ధతులు కూడా మారాయి. ఇప్పుడు, పెట్టుబడిదారులు కేవలం భౌతిక బంగారానికే (నగలు, కాయిన్‌లు, బిస్కట్‌లు, కడ్డీలు వంటివి) పరిమితం కాకుండా, పసిడి పెట్టుబడుల్లో కొత్త మార్గాల వైపు చూస్తున్నారు. డిజిటల్ గోల్డ్ (Digital Gold), గోల్డ్ బాండ్లు (Gold bonds), గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు (Gold mutual funds), గోల్డ్ ETFలు (Exchange Traded Funds) వంటి కొత్త ఆప్షన్లలోనూ పెట్టుబడులు పెడుతున్నారు.
డిజిటల్ గోల్డ్ వల్ల బోలెడు ప్రయోజనాలు
నగల వంటి భౌతిక బంగారం (Physical Gold)తో పోలిస్తే డిజిటల్ గోల్డ్ సాధనాల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ పెట్టుబడి (బంగారం) ఆన్‌లైన్‌లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దొంగల భయం ఉండదు. నగల తయారీ, తరుగు వంటి ఛార్జీలతో పోలిస్తే, డిజిటల్ బంగారంలో ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. డిజిటల్ గోల్డ్ సాధనాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకోవచ్చు..
గోల్డ్ ETFలు ఎంత రాబడి ఇస్తున్నాయి?
'అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా' (AMFI) డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరిలో, గోల్డ్ ETFలో ప్రజలు రూ. 3,751 కోట్లు పెట్టుబడి పెట్టారు. అంతకుముందు నెల, 2024 డిసెంబర్‌లో వచ్చిన రూ. 640 కోట్ల కంటే ఇది 6 రెట్లు అధికం. రాబడి విషయానికి వస్తే (Return On Gold ETFs), గత సంవత్సర కాలంలో, గోల్డ్ ETFలు 39% వరకు లాభాలు తెచ్చి ఇచ్చాయి. 3 సంవత్సరాల సగటు వార్షిక రాబడి దాదాపు 18%గా ఉంది. గత సంవత్సర కాలంలో బంగారం ధరలు 38 శాతానికి పైగా పెరిగాయి, గత మూడేళ్లలో దాదాపు 88 శాతం పెరిగాయి.
మన దేశంలో, AUM ప్రాతిపదికన టాప్-10 గోల్డ్ ETFలు
Nippon India ETF Gold BeES (AUM: రూ. 16,976 కోట్లు)
HDFC Gold ETF (AUM: రూ. 8,020 కోట్లు)
ICICI Prudential Gold ETF (AUM: రూ. 6,993 కోట్లు)
Kotak Gold ETF (AUM: రూ. 6,654 కోట్లు)
SBI Gold ETF (AUM: రూ. 6,573 కోట్లు)
UTI Gold ETF (AUM: రూ. 1,599 కోట్లు)
Axis Gold ETF (AUM: రూ. 1,304 కోట్లు)
ABSL Gold ETF (AUM: రూ. 1,023 కోట్లు)
DSP Gold ETF (AUM: రూ. 722 కోట్లు)
Mirae Asset Gold ETF (AUM: రూ. 521 కోట్లు)
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ - గోల్డ్ ఇటీఎఫ్‌ల మధ్య తేడా ఏమిటి?
గోల్డ్ మ్యూచువల్ ఫండ్లను కంపెనీలు నిర్వహిస్తాయి & గోల్డ్ ఇటీఎఫ్‌లలో పెట్టుబడి పెడతాయి. వీటిలో, SIP ద్వారా తక్కువ మొత్తంతో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
గోల్డ్ ఇటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ అవుతాయి & వాటి యూనిట్లలో కొనవచ్చు. యూనిట్ ధర బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. వీటిని కొనడానికి డీమ్యాట్ ఖాతా అవసరం.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల కంటే గోల్డ్ ఇటీఎఫ్ వ్యయ నిష్పత్తి (ఛార్జీలు) తక్కువగా ఉంటుంది, అందువల్ల పెట్టుబడిదారులు అధిక రాబడి పొందే అవకాశం ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రూ.5,400 పతనమైన పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ