Duplicate PAN Card: భారత్‌లో నివసించాలంటే చాలా పత్రాలు కావాలి. ఇక్కడ అధికారికంగా ఎలాంటి పని కావాలన్నా సరే ఈ పత్రాలు చాలా అవసరం. రోజూ ఎక్కడో ఏదో ఒక పనికి ఈ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఈ పత్రాల్లో ఆధార్ కార్డు ఎంత అవసమో... ఆ స్థాయిలోనే పాన్‌ కార్డు కూడా అవసరం అవుతుంది. పాన్ కార్డ్ లేకుండా మీ బ్యాంకింగ్ సంబంధిత, ఆదాయ పన్ను రిటర్న్ సంబంధిత ఏ పని పూర్తి చేయలేం. భారతదేశంలో పాన్ కార్డ్ ప్రతి ఒక్కరికీ ఒకసారి మాత్రమే జారీ చేస్తారు. 

ఇంతటి ముఖ్యమైన పాన్ కార్డు కొన్ని సార్లు ఎక్కడో పెట్టి మర్చిపోవడమో. లేదంటే ప్రయాణ సమయాల్లో పోవడమో, లేకుంటే పర్స్‌లో పెట్టి ఉంటే ఎవరైనా కొట్టేయడమైనా జరిగే ఉంటుంది. ప్రత్యేకంగా పాన్ కార్డు కొట్టేయడానికి ఎవరూ ప్రయత్నించరు కానీ, ఉన్న పర్స్‌తో పోయి ఉంటుంది. అలాంటి టైంలో మళ్లీ పాన్ కార్డు తీసుకోవాలంటే మాత్రం కుదరదు. 

రెండోసారి పాన్ కార్డు ఇవ్వరు. అది లేకుండా ఏ పని పూర్తి కాదు. అలా అయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మొదటగా ఏమి చేయాలి? రెండో పాన్ కార్డ్ ఎలా పొందాలి? దానికి ఎంత ఫీజు చెల్లించాలి? ఒకసారి చూద్దాం. 

మొదటగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలిమీ పాన్ కార్డ్ పోతే మొదటగా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పాన్ కార్డు పోయిందని ఫిర్యాదు చేయాలి. తద్వారా మీ పాన్ కార్డ్‌తో ఏదైనా అక్రమ కార్యకలాపాలు జరిగితే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మీ మీదకు సమస్య రాకుండా ఉంటుంది. మీరు సురక్షితంగా ఉంటారు. ఈ విషయంలో లైట్ తీసుకుంటే మాత్రం ఏదైనా ఆర్థిక నేరం జరిగితే పోలీసులు మిమ్మల్ని పట్టుకునే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పాన్ కార్డ్ పోయినట్లు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీని మీరు డూప్లికేట్ పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు కూడా జత చేయాల్సి ఉంటుంది. 

డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం ఇలా దరఖాస్తు చేయండిడూప్లికేట్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు NSDL అధికారిక వెబ్‌సైట్ onlineservices.nsdl.com/paam/ReprintEPan.html కు వెళ్లాలి. అక్కడ మీ పాన్ కార్డ్ నంబర్, మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత మీ పుట్టిన తేదీ నమోదు చేయాలి. పైన ఇచ్చిన సూచనలపై టిక్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.

తర్వాత మీ చిరునామా, పిన్ కోడ్ నిర్ధారించుకోవాలి. చిరునామా నిర్ధారించిన తర్వాత పాన్ కార్డ్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. దాన్ని నమోదు చేసిన తర్వాత మీరు 50 రూపాయల ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత మీకు ఒక స్లిప్ వస్తుంది. అందులో ఒక ట్రాకింగ్ నంబర్ ఉంటుంది. దాని ద్వారా మీరు మీ కొత్త పాన్ కార్డ్‌ను ట్రాక్ చేయవచ్చు.