Insurance policy at lower cost with Bima Sugam: జీవిత బీమా, ఆరోగ్య బీమా విషయాల్లో భారతీయుల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇన్సూరెన్స్‌ ఉండాల్సిన అవసరం, ప్రయోజనాలు ప్రజలకు అర్ధమయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా బీమా పథకాలు, ఉత్పత్తుల (Insurance plans and products) కొనుగోళ్లు కొన్ని రెట్లు పెరిగాయి. దీంతో, ఇన్సూరెన్స్‌ కంపెనీల మధ్య పోటీ పెరిగి, గతంలో కంటే మెరుగైన, సమగ్ర పాలసీలను (Comprehensive policy) లాంచ్‌ చేశాయి, చేస్తున్నాయి. పాలసీ కొనుగోలు నుంచి క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ వరకు అన్ని విషయాలను కస్టమర్లకు అర్ధమయ్యే భాషలో వివరిస్తున్నాయి.


కరోనా ముందు వరకు అందుబాటులోని లేని చాలా సర్వీస్‌లను ఇప్పుడు బీమా కంపెనీలు అందిస్తున్నాయి. డాక్టర్‌ కన్సల్టేషన్‌, ఔషధాల బిల్లులు సహా ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (OPD) ఖర్చులను కవర్‌ చేసే పాలసీలను లాంచ్‌ చేశాయి. రూ.5 కోట్ల రేంజ్‌ వరకు వివిధ వైద్య ఖర్చులు, విదేశాల్లో వైద్య చికిత్సలను కవర్‌ చేస్తున్నాయి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు/వ్యాధులకు కూడా కవర్‌ చేసేలా వాల్యు-యాడెడ్‌ సేవలతో (Value-added services) కొత్త పాలసీలను అందిస్తున్నాయి.


మోటార్‌ బీమాలో ‍‌(Motor insurance) ‘పే-యాజ్‌-యు-యూజ్‌’, ‘పే-యాజ్‌-యు-డ్రైవ్‌’ వంటి ఫీచర్లను పరిచయం చేశాయి. వాహనం తిరిగిన కిలోమీటర్ల ఆధారంగా బీమా చేస్తున్నాయి, ఆ లెక్కనే ప్రీమియం తీసుకుంటున్నాయి. దీనివల్ల, యూజర్లకు ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. చాలా ఇన్సూరెన్స్‌ కంపెనీలు రైడర్స్‌ (insurance riders) లేదా వాల్యూ యాడెస్‌ ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నాయి.


టర్మ్‌ ప్లాన్‌ ‍‌(Term plan) కవరేజ్‌ మొత్తం భారీ ఉంటున్నా, ఒకవేళ పాలసీదారు క్షేమంగా ఉంటే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. ఈ కారణం వల్లే ఎక్కువ మంది టర్మ్‌ ప్లాన్లను పట్టించుకోవడం లేదు. దీనిలోనూ బీమా సంస్థలు మార్పులు చేశాయి. పాలసీ కాల పరిమితి ముగియక ముందే ఎగ్జిట్‌ అయ్యి, అప్పటివరకు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని (GST మినహా) వెనక్కు తీసుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. 45 ఏళ్ల లోపు వయస్సున్న వాళ్లకు, లాంగ్‌ టర్మ్‌ పాలసీ తీసుకున్న వాళ్లకు ఎగ్జిట్‌ అవకాశం ఇస్తున్నాయి. 


‘బీమా సుగమ్‌’ ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ‍‌(Bima Sugam is an online marketplace)
జీవిత బీమా, జీవితేతర బీమా (జనరల్‌, మోటార్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటివి) పాలసీలను ఆఫర్‌ చేసే అన్ని కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ‘బీమా సుగమ్‌’ (Bima Sugam) పేరుతో ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ను ప్రారంభించారు. ఇది ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌. దీని ద్వారా.... జీవిత, ఆరోగ్య, మోటారు బీమా పాలసీలను వివిధ బీమా సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల, తక్కువ ఖర్చుతోనే పాలసీ తీసుకోవచ్చు. మధ్యవర్తులు అందించే సేవలను కూడా పొందవచ్చు. ఈ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా వివిధ పాలసీ రేట్లను, కవరేజ్‌ మొత్తాలను, ఫీచర్లను పోల్చి చూడొచ్చు. తద్వారా, ఉత్తమమైన & అనుకూలమైన ప్లాన్‌ను ఎంచుకునే వెసులుబాటు యూజర్‌కు లభిస్తుంది. పోర్టబిలిటీ, ఆన్‌లైన్‌ యాక్సెస్‌, రెన్యువల్స్‌ (Insurance policy renewal) కూడా చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. 


మరో ఆసక్తికర కథనం: రూ.63 వేల కిందకు దిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే