ITR Filing 2025: ఆర్థిక సంవత్సరం 2025-26 కోసం ఫిబ్రవరి 01న బడ్జెట్‌ (Budget 2025) సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman), మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం కల్పించారు. బడ్జెట్‌ ప్రతిపాదన ప్రకారం, రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను రహితం. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) వరకు, అంటే, మార్చి 31, 2025 వరకు, రూ. 7 లక్షల వరకు వార్షికాదాయంపై పన్ను లేదు.

ఈ 'సున్నా పన్ను బాధ్యత' (Zero tax liability) 2023-24 నుంచి డిఫాల్ట్ వ్యవస్థగా అమలులో ఉన్న కొత్త పన్ను విధానానికి (New Tax Regime) మాత్రమే వర్తిస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 నుంచి, అంటే ఏప్రిల్‌ 01, 2025 నుంచి రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఒక్క పైసా కూడా టాక్స్‌ కట్టక్కరలేదు. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవడానికి, ప్రజలు తమ ఆదాయ పన్ను రిటర్న్ (ITR filing) దాఖలు చేయాలి.

ఇప్పుడు రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఎంత పన్ను చెల్లించాలి?2025 బడ్జెట్‌లో, కొత్త ఆదాయ పన్ను విధానం కింద ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన కొత్త టాక్స్‌ శ్లాబ్‌లు ఏప్రిల్‌ 01, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే, ఇప్పుడు (మార్చి 31 వరకు) పాత పన్ను శ్లాబ్‌లే అమల్లో ఉన్నట్లు లెక్క. దీని ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను పత్రాలు సంపాదించే వ్యక్తి ఆదాయం రూ. 12 లక్షలు అయితే, అతను 15% టాక్స్‌ చెల్లించాలి. ఉద్యోగులకు అదనంగా రూ.75,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ లభిస్తుంది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి అమల్లో ఉన్న టాక్స్‌ శ్లాబ్‌లు

రూ. 7,00,000 వరకు ----- 0 టాక్స్‌ రూ. 7,00,001 నుంచి రూ.10,00,000 ----- 10% టాక్స్‌ రూ. 10,00,001 నుంచి రూ.12,00,000 ----- 15% టాక్స్‌ రూ. 12,00,001 నుంచి రూ.15,00,000 ----- 20% టాక్స్‌ రూ. 15,00,001 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ----- 30% టాక్స్‌ 

వాస్తవానికి, కొత్త పన్ను విధానం ప్రకారం, సంవత్సరానికి రూ. 12 లక్షలు సంపాదించే వ్యక్తి దాదాపు రూ. 60,000 పన్ను చెల్లించాలి. అయితే, రూ. 12 వార్షికాదాయం లోపున్న వ్యక్తులకు రిబేట్‌ ఇస్తారు కాబట్టి, ఈ మొత్తానికి మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగులకు అదనంగా రూ.75,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ ఉంటుంది. ఈ పన్ను మినహాయింపులు పొందడానికి ఐటీఆర్ దాఖలు చేయాలి. ఒక వ్యక్తి ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి. ప్రాథమిక మినహాయింపు పరిమితిని దాటని సందర్భంలోనే పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలు చేయడంలో మినహాయింపునకు అర్హులు. 

దీంతో పాటు, కొన్ని ఇతర ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో, మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని దాటకపోయినా రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి. అవి:

బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలో రూ.1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్‌ ఉంటేవిద్యుత్ బిల్లు లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటేవిదేశీ ప్రయాణ ఖర్చు రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాళ్లు

కొత్త పన్ను విధానంలో మార్పుల లక్ష్యం రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితంగా మార్చడం. చేయడం మరియు రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల ఆదాయంపై 25 శాతం కొత్త పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టడం. కొత్త స్లాబ్ నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంది- 

రూ.12,00,000 వరకు ----  0 టాక్స్‌ రూ.12,00,001 - 16,00,000  ----- 15% టాక్స్‌ రూ.16,00,001 - 20,00,000 ----- 20%రూ. 20,00,001 - 24,00,000 ----- 25%రూ. 24,00,001 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ----- 30% టాక్స్‌ 

మరో ఆసక్తికర కథనం: ట్రంప్‌ దెబ్బకు మండుతున్న గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ