DMart Q1 Results: 


అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ (డీమార్ట్‌) మెరుగైన ఫలితాలను విడుదల చేసింది. జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్లో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.11,584 కోట్ల ఆదాయం ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలోని రూ.9,806 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది. మార్చి క్వార్టర్లో కంపెనీ రూ.10,337 కోట్ల ఆదాయం నమోదు చేయడం గమనార్హం.


మొదటి త్రైమాసికంలో డీమార్ట్‌ మరో మూడు స్టోర్లను తెరిచింది. దాంతో జూన్ ముగిసే నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 327కు చేరుకుంది. ఇంతకు ముందు క్వార్టర్లో డీమార్ట్‌ వార్షిక ప్రాతిపదికన 8 శాతం వృద్ధితో రూ.505 కోట్ల నికర లాభం నమోదు చేసింది. నాలుగో క్వార్టర్లో ఎబిటా ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.783 కోట్లకు చేరుకుంది. అయితే ఆపరేటింగ్‌ మార్జిన్‌ 7.6 శాతం తగ్గింది.


అవెన్యూ సూపర్‌మార్ట్‌ ఆదాయం 2023-25 ఆర్థిక ఏడాదిలో 27 శాతం సీఏజీఆర్‌ నమోదు చేస్తుందని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌  అంచనా వేసింది. ఆస్తులతో పోలిస్తే మార్కెట్ వృద్ధి, మార్జిన్‌, పెట్టుబడిపై రాబడి కాస్త వాల్యూయేషన్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే టార్గెట్‌ను రూ.4200కు పెంచింది. ప్రస్తుత స్థాయి నుంచి ఇది 18 శాతం ఎక్కువ.


'కొవిడ్‌ కారణంగా మూడేళ్లుగా కొనుగోలుదారులు తగ్గి రిటైలర్స్‌ ఇబ్బంది పడ్డ తరుణంలోనూ డీమార్ట్‌ మెరుగ్గా నడిచింది. మంచి యాజమాన్య పద్ధతులను ఆచరించింది. 2020-23 ఆర్థిక ఏడాదిలో 20 శాతం సీఏజీఆర్‌ నమోదు చేసింది. 19 శాతం రెవెన్యూ గ్రోత్‌ కనబరిచింది' అని మోతీలాల్‌ తెలిపింది.


Also Read: యెస్ బ్యాంక్‌ FDలపై మరింత ఆదాయం - వడ్డీ రేట్లు పెంపు


చివరి ఐదేళ్లలో డీమార్ట్‌ స్టాక్‌ EV/EBITAతో పోలిస్తే 60 రెట్లు, PEతో పోలిస్తే 99 రెట్లు ఎక్కువగా ఉంది. 2022, సెప్టెంబర్‌ నుంచి కరెక్షన్‌కు గురవ్వడంతో EV/EBITAతో పోలిస్తే 36 రెట్లు, PEతో పోలిస్తే 58 రెట్లకు తగ్గింది. హిస్టారికల్‌ ప్రైజ్‌తో పోలిస్తే షేర్లు 30 శాతం డిస్కౌంట్‌కు దొరుకుతున్నాయి. దాంతో ట్రెండ్‌లైన్‌ డేటా రూ.3,974 టార్గెట్‌గా ఇచ్చింది. సోమవారం డీమార్ట్‌ షేర్లు 0.85 శాతం నష్టంతో రూ.3,856 వద్ద ముగిసింది.


Stock Market Closing 3 July 2023:


స్టాక్‌ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. మరో కొత్త లైఫ్ టైమ్ హై పాయింట్‌ను టచ్‌ చేశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 133 పాయింట్లు పెరిగి తొలిసారి 19,322 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 486 పాయింట్లు పెరిగి 65,205 వద్ద ముగిశాయి. మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలపడి 82.04 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు నేడు మరో రూ.2 లక్షల కోట్లు ఆర్జించారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial