Bank FD Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), కీలకమైన రెపో రేటును గత వారం 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీంతో బ్యాంకులు రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. మే 2022 నుంచి RBI తన రెపో రేటును ఆరు సార్లుగా, మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది. అప్పటి నుంచి SBI, PNB, ICICI బ్యాంక్ సహా అనేక బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను దఫదఫాలుగా పెంచాయి.
యాక్సిస్ బ్యాంక్, PNB, ICICI బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ప్రస్తుత ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించాయి.
ఫిబ్రవరి 11, 2023 నుంచి, రూ. 2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద యాక్సిస్ బ్యాంక్ సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:
Axis Bank FD Rates
7 నుంచి 45 రోజుల కాల వ్యవధి డిపాజిట్ల మీద సాధారణ ప్రజలు & సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ
46 రోజుల నుంచి 60 రోజుల కాల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం వడ్డీ
61 నుంచి 3 నెలల కాల వ్యవధి డిపాజిట్ల మీద 4.50 శాతం వడ్డీ
3 నుంచి 6 నెలల కాల వ్యవధి డిపాజిట్ల మీద 4.75 శాతం వడ్డీ
6 నుంచి 9 నెలల కాల వ్యవధి డిపాజిట్ల మీద సామాన్యులకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ
1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 24 రోజుల కాల వ్యవధి డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 6.75 శాతం వడ్డీ & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ
2 సంవత్సరాల నుంచి 30 నెలల కాల వ్యవధి డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 7.26 శాతం వడ్డీ & సీనియర్ సిటిజన్లకు 8.01 శాతం వడ్డీ
3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 7 శాతం &సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ
Punjab National Bank FD Rates
7 రోజుల నుంచి 45 రోజుల మధ్య, సాధారణ ప్రజలకు 3.50 శాతం & సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ
91 రోజుల నుంచి 179 రోజుల మధ్య, సాధారణ ప్రజలకు 4.50 శాతం & సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం వడ్డీ
180 రోజుల నుంచి 270 రోజుల మధ్య, సాధారణ ప్రజలకు 5.50 శాతం & సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ
271 రోజుల నుంచి 1 సంవత్సరం మధ్య, సాధారణ ప్రజలకు 5.50 శాతం & సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ
1 సంవత్సరం కాల వ్యవధి డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 6.75 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ
1 సంవత్సరం నుంచి 665 రోజుల కాల వ్యవధి డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 6.75 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ
666 రోజుల ప్రత్యేక FDపై సాధారణ ప్రజలకు 7.25 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య, సాధారణ ప్రజలకు 6.75 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య, సాధారణ ప్రజలకు 6.50 శాతం & సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య, సాధారణ ప్రజలకు 6.50 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వడ్డీ
ICICI Bank FD Rates
7 రోజుల నుంచి 29 రోజుల వరకు, సామాన్య ప్రజలకు &సీనియర్ సిటిజన్లకు 3 శాతం వడ్డీ
30 రోజుల నుంచి 45 రోజుల వరకు, సామాన్యులకు 3.50 శాతం & సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ
91 నుంచి 184 రోజుల వరకు, సాధారణ ప్రజలకు 4.75 శాతం & సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం వడ్డీ
290 రోజుల నుంచి ఒక సంవత్సరం మధ్య, సాధారణ ప్రజలకు 5.75 శాతం & సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ
1 సంవత్సరం నుంచి 389 రోజుల మధ్య, సాధారణ ప్రజలకు 6.60 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ
390 రోజుల నుంతి 15 నెలల కాలానికి, సాధారణ ప్రజలకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ
15 నెలల నుంచి 18 నెలల మధ్య, సాధారణ ప్రజలకు 7 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ
18 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య, సాధారణ ప్రజలకు 7 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య, సాధారణ ప్రజలకు 7 శాతం వడ్డీ & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య, సాధారణ ప్రజలకు 7 శాతం వడ్డీ & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ
5 నుంచి 10 సంవత్సరాల మధ్య, సాధారణ ప్రజలకు 6.90 & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ