7th CPC Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! మరోసారి మీ జీతభత్యాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలలోనే కేంద్రం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. ఇదే జరిగితే కనీస వేతనం భారీగా పెరుగుతుంది. ఇందుకోసం సిద్ధం చేసిన ముసాయిదాను ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి అందజేసింది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపితే 52 లక్షల మందికి పైగా ఉద్యోగుల కనీస జీతం పెరుగుతుంది.
అదనపు లబ్ధి!
ప్రభుత్వం ఈ మధ్యే ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను పెంచిన సంగతి తెలిసిందే. జులై నుంచి వారు పెరిగిన డీఏ, డీఆర్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. కనీస జీతంతో పాటు మొత్తం వేతనం పెరుగుతుంది. ఉద్యోగులు సుదీర్ఘ కాలం నుంచి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
3 రెట్లకు పెంపు!
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఇది 3.48 రెట్లు అవుతుంది. ఉద్యోగులు వేతనం నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ది కీలక పాత్ర. కనీస జీతమే కాకుండా మొత్తం వేతనం పెరుగుతుంది. 2.57 నుంచి 3.68కి పెరిగితే ఉద్యోగుల కనీస వేతనం రూ.18వేల నుంచి రూ.26వేలకు చేరుకుంటుంది. 2017లో ఎంట్రీ లెవల్ ఎంప్లాయీస్ కనీస వేతనాలను ప్రభుత్వం పెంచింది. అప్పట్నుంచి ఇందులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు కనీస వేతనంగా రూ.18,000, గరిష్ఠంగా రూ.56,900గా ఉంది.
ఎంత పెరుగుతుంది!
ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3 రెట్లు పెంచితే అలవెన్సులు కాకుండా అందే మొత్తం ఇలా ఉంటుంది. ఉదాహరణకు 18000x2.57=రూ.46260. ఇప్పుడు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తున్నట్టు 3.6 రెట్లు అయితే 26,000x3.68=రూ.95,680 అవుతుంది. ప్రభుత్వం భావిస్తున్నట్టు 3 రెట్లు అయితే 21000x3=రూ.63,000గా ఉంటుంది.
Also Read: ₹లక్షను ₹3 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇది, అదీ 3 నెలల్లోనే!
Also Read: ట్రైన్ టిక్కెట్ బుకింగ్ సమయంలో చేస్తున్న ఒక్క తప్పుతో ₹10 లక్షలు అందకుండా పోతున్నాయి