పతంజలి ఫుడ్స్ అరుదైన ఘనత సాధించింది. AEO టైర్-2 సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇది సమగ్రత, ఫుడ్ చైన్ సేఫ్టీకి దీన్ని చిహ్నంగా పతంజలి భావిస్తోంది. AEO టైర్-2 గుర్తింపును పొందిన కొన్ని భారతీయ కంపెనీలలో ఒకటిగా పతంజలి నిలిచింది. ఈ ఘనతను దేశ నిర్మాణానికి దోహదపడే గౌరవంగా బాబా రామ్‌దేవ్ అభివర్ణించారు.

భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సమయంలో భారత్‌లోని ఇండ్లలో నమ్మకానికి చిహ్నంగా మారిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ స్వదేశీ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయాన్ని లఖించింది. ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (WCO) భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత కస్టమ్స్ తో కలిసి పతంజలికి AEO (అధికారిక ఆర్థిక ఆపరేటర్) టైర్-2 సర్టిఫికెట్ మంజూరు చేసిందని పతంజలి సంస్థ తెలిపింది. 

అరుదైన గుర్తింపుపై పతంజలి సంస్థ ఇలా పేర్కొంది, “ఈ AEO టైర్ 2 సర్టిఫికెట్ ప్రపంచ వ్యాపారంలో అత్యున్నత ప్రమాణాలైన నిజాయితీ, పారదర్శకతతో పాటు సరఫరా గొలుసు భద్రతకు చిహ్నం. మన దేవంలోని అగ్రశ్రేణి కంపెనీలలో కొన్ని మాత్రమే ఈ హోదాను కలిగి ఉన్నాయి. FMCG రంగంలో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందినవి కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. తాజాగా పతంజలి పేరు ఈ జాబితాలో సువర్ణాక్షరాలతో చేర్చారు.”

“AEO టైర్-2 సర్టిఫికెట్‌తో పతంజలి కంపెనీ డ్యూటీ డిఫర్డ్ పేమెంట్, బ్యాంక్ గ్యారంటీ నుంచి మినహాయింపు, డైరెక్ట్ పోర్ట్ డెలివరీ, 24x7 క్లియరెన్స్ సౌకర్యాలు మొదలైన వాటితో సహా 28 కంటే ఎక్కువ అంతర్జాతీయ బిజినెస్ ప్రయోజనాలను సంస్థ పొందుతుంది” అని పతంజలి పేర్కొంది.

ఈ సర్టిఫికెట్ ఎందుకంత ప్రత్యేకమైనది?

పతంజలి ప్రకారం.. “ఏఈవో టైర్ 2 సర్టిఫికెట్ ఏదైనా కంపెనీ నాణ్యత, సమగ్రత, పారదర్శకత విధానం, జాతీయ ప్రయోజనానికి చేసిన కృషికి సాక్ష్యం లాంటిది. పతంజలి సంస్థ తన నాణ్యత, అంకితభావంతో కూడిన పని, విధేయతతో కూడిన విధానం, స్వదేశీ స్ఫూర్తి ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇది కేవలం ఒక సర్టిఫికెట్ మాత్రమే కాదు, భారత ఆర్థిక స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేసే గౌరవంగా భావిస్తున్నాం” అని అభిప్రాయపడింది.

ఈ గుర్తింపుపై బాబా రాందేవ్ ఏమన్నారు?

యోగా గురువు బాబా రాందేవ్ మాట్లాడుతూ, “ఈ రోజు పతంజలి ఫ్యామిలీకి మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు గర్వించాల్సిన రోజు ఇది. పతంజలి ప్రతిరోజూ విశ్వసనీయత, ప్రామాణికత, పోటీతత్వంతో పాటు నాణ్యత రంగాలలో దూసుకెళ్తోంది. భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక అగ్రగామిగా చూడాలనుకునే వారందరికీ వ్యాపార ప్రపంచంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఈ టైర్ 2 సర్టిఫికెట్ మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. ఈ గౌరవం మా అంకితభావం, నాణ్యత, నిజాయితీకి దక్కిన గుర్తింపు. ‘స్వదేశీ నుంచి ఆత్మగౌరవం’ విధానంలో మేం మరింత వేగంగా ముందుకు సాగుతాం. ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రపంచంలో మరో శిఖరానికి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము” అన్నారు.

సర్టిఫికెట్ అందుకున్న తర్వాత ఆచార్య బాలకృష్ణ కామెంట్స్

ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ, “ఈ విజయం మొత్తం పతంజలి కుటుంబం, ఉద్యోగులు మరియు వినియోగదారుల సామూహిక కృషి ఫలితం. AEO టైర్-2 సర్టిఫికెట్ మా పని పారదర్శకత, నాణ్యత మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని రుజువు. ఇది ఎగుమతి కార్యకలాపాలను పెంచుతుంది మరియు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ గౌరవం దేశ సరిహద్దుల్లోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి మూలన భారతీయ సంస్కృతి, ఆయుర్వేదం మరియు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మేము పతంజలిని ప్రపంచంలోని అగ్ర FMCG బ్రాండ్లలో ఒకటిగా స్థాపిస్తామని మరియు భారతదేశ ఎగుమతులను కొత్త శిఖరాలకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.”