RC Book Transfer & Driving License Address Change Online: ఏదైనా కారు, బైక్ లేదా స్కూటర్ కొన్నప్పుడు, అమ్మినప్పుడు లేదా లేదా మరో ఊరికి మారినప్పుడు RC బుక్ (వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) ట్రాన్సఫర్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్పు చాలా ముఖ్యం. ఇవి చేయకపోతే భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, ప్రతి వాహనదారుడు ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి, అప్‌డేటెడ్‌గా ఉండాలి.
RC బుక్ ట్రాన్సఫర్ ఎందుకు అవసరం?మీరు మీ వాహనాన్ని అమ్మినప్పుడు, కొత్త కొనుగోలుదారుడే దాని చట్టబద్ధమైన యజమాని అవుతాడు. అమ్మిన తర్వాత కూడా RC బుక్ మీ పేరుపైనే ఉంటే ప్రమాదం. ట్రాఫిక్ ఫైన్ లేదా క్రిమినల్ కేసుల వంటి సమస్యలు మీకే తగులుతాయి. అందుకే RC బుక్ ట్రాన్సఫర్ చేయడం తప్పనిసరి, అది మీకే మంచిది.
RC బుక్ ట్రాన్సఫర్‌కి కావలసిన డాక్యుమెంట్లు
- ఒరిజినల్ RC
- ఫామ్ 28, 29, 30 (Parivahan వెబ్‌సైట్ లేదా RTO కార్యాలయంలో లభిస్తాయి)
- ఇన్సూరెన్స్ కాపీ
- PUC సర్టిఫికేట్
- సెల్లర్, బయ్యర్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లు
- వాహనం మీద లోన్ ఉంటే NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)
RC బుక్ ట్రాన్సఫర్ ప్రక్రియ
- Parivahan వెబ్‌సైట్ parivahan.gov.in లోకి వెళ్లి → Online Services → Vehicle Related Services ఎంపిక చేయాలి.
- వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి.
- RC Transfer కోసం Application Form నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- అవసరమైతే RTO కార్యాలయానికి వెళ్ళి డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించాలి.
- ఒకసారి అప్రూవ్ అయితే, RC కొత్త యజమాని పేరుతో జారీ అవుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్పు ఎందుకు చేయాలి?
మీరు కొత్త ఊరికి, కొత్త రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, మీ లైసెన్స్‌లో ఉన్న పాత చిరునామాను వాడితే చట్టపరమైన సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఐడీ ప్రూఫ్‌గా లైసెన్స్ ఉపయోగించే సమయంలో సమస్యలు తలెత్తుతాయి.
డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లు
- ఒరిజినల్ లైసెన్స్
- కొత్త చిరునామా ప్రూఫ్ (ఆధార్, రెంట్ అగ్రిమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటివి)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- దరఖాస్తు ఫారం
లైసెన్స్ అడ్రస్ మార్పు ప్రక్రియ
- Parivahan (దేశంలో ఎవరైనా) లేదా T App Folio (తెలంగాణ వాసులకు మాత్రమే) యాప్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- ఫారం నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- RTOలో బయోమెట్రిక్స్ కోసం హాజరు కావాలి.
- అప్రూవ్ అయిన తర్వాత కొత్త చిరునామాతో లైసెన్స్ జారీ అవుతుంది.
అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- అన్ని ఫారాలను తప్పులు లేకుండా నింపండి.
- వాహనంపై లోన్ ఉంటే ముందుగా NOC తీసుకోండి.
- వాహనాన్ని అమ్మిన వెంటనే RC ట్రాన్సఫర్ ప్రక్రియ మొదలుపెట్టండి.
- లైసెన్స్ అడ్రస్ మార్పును ఆలస్యం చేస్తే, కొత్త ఊరిలో ఇన్సూరెన్స్, వాహన ఫైనాన్స్‌లకు ఇబ్బంది అవుతుంది.
RC బుక్ ట్రాన్సఫర్, లైసెన్స్ అడ్రస్ మార్పు చిన్న పనిగా అనిపించి చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒకప్పుడంటే RTO ఆఫీస్ చుట్టూ తిరగాలి గానీ, ఇప్పుడు డిజిటల్ సౌకర్యాల వల్ల ఈ పనులు ఆన్‌లైన్‌లోనే సులభంగా పూర్తవుతున్నాయి.