Patanjali Broncom Can Cure Lung Diseases: ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. మైక్రోప్లాస్టిక్స్ అని పిలువబడే ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు ఇప్పుడు గాలి, నీరు , ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ కణాలు మానవ శరీరంలోకి, ముఖ్యంగా ఊపిరితిత్తులలోకి ప్రవేశించినప్పుడు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాపు, చికాకు , కణ నష్టం వంటి సమస్యలను కలిగిస్తున్నాయి. ఇది ఊపిరితిత్తుల వాపు , ఎయిర్‌వే హైపర్-రెస్పాన్సివ్‌నెస్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతున్నాయి.
మైక్రోప్లాస్టిక్‌ల వల్ల కలిగే ఊపిరితిత్తుల పనితీరులో వచ్చే సమస్యలను ఆయుర్వేద ఔషధం 'బ్రాంకామ్' ద్వారా చాలా వరకు నివారించవచ్చు. పతంజలి కంపెనీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన నిర్ధారించిందని ఆ సంస్థ ప్రకటించింది.
పతంజలి ఏమి చెప్పిందంటే ?
"సైటోకిన్ రిలీజ్ ఎయిర్‌వే హైపర్-రెస్పాన్సివ్‌నెస్ వంటి మైక్రోప్లాస్టిక్‌ల వల్ల కలిగే ఊపిరితిత్తుల వాపుతో సంబంధం ఉన్న సమస్యలను 'బ్రోంకామ్' చికిత్స తగ్గించింది. ఈ ప్రత్యేకమైన పరిశోధన నిర్ధారించింది" అని పతంజలి పేర్కొంది. ఈ పరిశోధన ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ పరిశోధన జర్నల్ 'బయోమెడిసిన్ & ఫార్మకోథెరపీ'లో ప్రచురించిందని కూడా కంపెనీ ప్రకటించింది.
"ఆయుర్వేదాన్ని శాస్త్రీయంగా ధృవీకరించడం, ప్రపంచంలోని ప్రస్తుత ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను అందించడం పతంజలి లక్ష్యం. పర్యావరణ కారకాల వల్ల కలిగే వ్యాధులకు పరిష్కారాలు పురాతన జ్ఞానం, లక్ష్య పరిశోధన, ఆధారాల ఆధారిత ఔషధాల ద్వారా సాధ్యమని ఈ పరిశోధన రుజువు చేస్తుంది" అని ఆచార్య బాలకృష్ణ ప్రకటించార..ుు
"పురాతన జ్ఞానం ,ఆధునిక శాస్త్రం కలిపి ఈ అద్భుతమైన ఔషధం మొత్తం ప్రపంచాన్ని ఆరోగ్యంగా మార్చడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని పతంజలి పరిశోధనా సంస్థ ఉపాధ్యక్షుడు , ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ వర్షణ్య ప్రకటించారు. ఆయుర్వేదం పురాతన జ్ఞానాన్ని శాస్త్రీయ ఆధారాలతో సహా ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు.