Patanjali Foods OFS: బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఫుడ్స్ షేర్లు ఇవాళ్టి (గురువారం, 13 జులై 2023) ట్రేడ్‌లో లోయర్ సర్క్యూట్‌లోకి వెళ్లి పడ్డాయి. ప్రమోటర్ కంపెనీ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ (Patanjali Ayurved Limited) రెండు రోజుల ఆఫర్ ఫర్ సేల్ (OFS) స్కీమ్ ఇవాళ స్టార్ట్ అయింది.
ప్రస్తుతం, BSEలో, పతంజలి ఫుడ్స్ షేర్లు 5% లోయర్ సర్క్యూట్‌లో చిక్కుకుని రూ. 1,166.65 వద్ద ఉన్నాయి.
రేపు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం..
పతంజలి ఫుడ్స్ నుంచి వచ్చిన బుధవారం నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం... ఇవాళ, రేపు జరిగే ఆఫర్ ఫర్ సేల్‌లో ఈ కంపెనీకి చెందిన 9% వాటా లేదా 3.26 కోట్ల షేర్లను ప్రమోటర్ కంపెనీ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ విక్రయిస్తుంది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఇవాళ (జులై 13), రిటైల్ ఇన్వెస్టర్లకు రేపు (జులై 14) OFS అందుబాటులో ఉంటుంది. కాబట్టి, రేపు కూడా లోయర్ సర్క్యూట్ రిపీట్ కావచ్చు.
ఈ ఆఫర్‌లో ఫ్లోర్ ప్రైస్‌ను రూ. 1,000గా నిర్ణయించారు. అంటే, ఈ రేటు కంటే తక్కువకు షేర్లను విక్రయించరు. ఫ్లోర్ ప్రైస్ ప్రకారం లెక్కేస్తే, ప్రమోటర్లకు రూ. 3,260 కోట్లు వస్తాయి.
నిన్నటి (బుధవారం, 12 జులై 2023) ముగింపు ధర రూ. 1,228తో పోలిస్తే, OFS షేర్లు 18% డిస్కౌంట్‌తో దొరుకుతున్నాయి.
ఈ ఆఫర్ బేస్ సైజ్ 2.53 కోట్ల షేర్లు. ఇది, మొత్తం పెయిడప్ ఈక్విటీ క్యాపిటల్‌లో 7%కు సమానం. ఒకవేళ ఈ ఆఫర్ ఓవర్ సబ్‌స్క్రైబ్ అయితే, మరో 2% స్టేక్‌కు సమానమైన 72.39 లక్షల షేర్లను అదనంగా ఆఫ్‌లోడ్ చేస్తారు.
OFS వెనుకున్న కారణం ఇది
ఈ ఏడాది జూన్ 30 నాటికి, పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్లకు 80.82% వాటా ఉంది. రూల్ ప్రకారం దీనిని 75%కు తగ్గించాలి. సెబీ రూల్ ప్రకారం, ఒక లిస్టెడ్ ఎంటిటీకి కనీసం 25% పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) ఉండాలి. ఈ రూల్‌కు అనుగుణంగా ప్రమోటర్లు OFS ద్వారా స్టేక్ తగ్గించుకుంటున్నారు.
ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు (YTD), పతంజలి ఫుడ్స్ స్టాక్ 2% పైగా పడిపోయింది. గత 12 నెలల్లో 12% పెరిగింది. గత నెల రోజుల్లోనే దాదాపు 12% ర్యాలీ చేసింది. అంటే, గత 11 నెలల్లో వచ్చిన నష్టాలను గత నెల రోజుల్లో భర్తీ చేసింది. గత ఆరు నెలల్లో ఫ్లాట్‌గా ట్రేడయింది.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం... పతంజలి ఫుడ్స్ స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 1,405. ప్రస్తుత మార్కెట్ ప్రైస్ నుంచి 21% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఇది చూపుతోంది. ఈ స్టాక్‌ను ఒకే ఒక్క ఎనలిస్ట్ ట్రాక్ చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన రేటింగ్ 'స్ట్రాంగ్ బయ్'.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ 60k టచ్ చేసిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial