Patanjali Food And Hearbal Park:మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని MIHAN (మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్‌పోర్ట్) ప్రాంతంలో పతంజలి 'మెగా ఫుడ్ అండ్ హర్బల్ పార్క్'ను ప్రారంభించనుంది. ఈ ప్లాంట్ 2025 మార్చి 9న కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ యూనిట్‌కు సంబంధించిన భూమి పూజ 2016 సెప్టెంబర్‌లో జరిగింది.


 నాగ్‌పూర్ ప్లాంట్ ద్వారా ప్రస్తుతం  ప్రత్యక్షంగా 500మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ కార్యకలాపాలు విస్తరించే కొద్దీ ఈ సంఖ్య 10వేలకు చేరుతుందని పతంజలి ప్రకటించింది.


ఎందుకు నాగ్‌పూర్‌ను ఎంపిక చేశారు?


నారింజలంటేనే నాగపూర్ అన్నది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే. నాగ్‌పూర్  'ఆరెంజ్ సిటీ'గా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో నారింజ, మందారిన్, ముసంబి, నిమ్మ వంటి సిట్రస్ ఫలాలు సమృద్ధిగా లభిస్తాయి. నాగ్‌పూర్‌లోని పతంజలి యూనిట్ పండ్లు కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్ సిట్రస్, ఉష్ణమండల ఫలాలను  కూరగాయలను ప్రాసెస్ చేసి జ్యూసులు, జ్యూస్ కాన్సన్‌ట్రేట్లు, పల్ప్, పేస్ట్, ప్యూరీలను తయారు చేస్తుంది.


ఈ సంస్థ 800 టన్నుల సిట్రస్ ఫలాలను రోజుకు ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. “ఇది పూర్తిగా సహజమైన జ్యూస్‌గా తయారవుతుంది, ఇందులో ఎటువంటి కృత్రిమ పదార్థాలు, చక్కెర ఉండదు.” అని పతంజలి తెలిపింది.


రోజువారీ ప్రాసెసింగ్ సామర్థ్యం:


ఈ ప్లాంట్ ప్రతిరోజూ 600 టన్నుల ఉసిరికాయ, 400 టన్నుల మామిడి, 200 టన్నుల జామ,200 టన్నుల బొప్పాయి,200 టన్నుల యాపిల్,200 టన్నుల దానిమ్మ,200 టన్నుల స్ట్రాబెర్రీ,200 టన్నుల ప్లమ్,200 టన్నుల పియర్,400 టన్నుల టమోటా,400 టన్నుల సొరకాయ,400 టన్నుల కాకరకాయ,160 టన్నుల క్యారెట్,100 టన్నుల ఆలొవెరా ను ప్రాసెస్ చేయగలుగుతుంది.


టెట్రా ప్యాక్ యూనిట్ త్వరలో ప్రారంభం


ప్రాథమిక ప్రాసెసింగ్ తరువాత, రిటైల్ ప్యాకింగ్ కోసం సెకండరీ ప్రాసెసింగ్ చేపడతారు. ఇందుకోసమే నాగ్‌పూర్ ఫ్యాక్టరీలో టెట్రా ప్యాక్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. పతంజలి తన ఉత్పత్తులను రసాయన పదార్థాలు లేకుండా, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టెట్రా ప్యాక్స్‌లో అందుబాటులోకి తేనుందని తెలిపింది.


ఏదీ వృథాగా పోదు


ఈ ప్లాంట్‌లో ఎటువంటి ఉప ఉత్పత్తులు వృథాగా పోకుండా చూసుకుంటారు. ఉదాహరణకు, నారింజ తొక్కల నుండి జ్యూస్‌ను తొలగించిన తర్వాత కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్‌ను తయారు చేస్తారు. దీనికి మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. అదనంగా, నారింజ పప్పును నాగ్‌పూర్ ఆరెంజ్ బర్ఫీలో ఉపయోగిస్తారు. ఫలాల నుండి ఆయిల్-బేస్డ్ అరోమా మరియు వాటర్-బేస్డ్ అరోమా ఎసెన్సులు కూడా తీయగలరు. ఇంకా, నారింజ తొక్కలను పొడి చేసి, అందాన్ని మెరుగుపరిచే ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు.