Ola Electric Scooters Flash Sale For Holi 2025: ఈ ఏడాది హోలీ సందర్భంగా, ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలోని S1 సిరీస్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్ కింద, కస్టమర్లు S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ (OLA S1 Air Electric Scooter) కోనుగోలుపై రూ. 26,750 వరకు పొందవచ్చు. అలాగే, S1 X+ సెకండ్ జనరేషన్ (OLA S1 X Gen 2) ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై మీద రూ. 22,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ మోడళ్ల ధర వరుసగా రూ. 89,999 & రూ. 82,999 నుంచి ప్రారంభమవుతాయి.
పరిమిత కాల ఆఫర్
ఓలా, ఈ డిస్కౌంట్ సేల్‌ను హోలీ సందర్భంగా ప్రకటించినప్పటికీ, హోలీ రోజుకు మాత్రమే పరిమితం చేయలేదు. మార్చి 13న ప్రారంభమైన ఓలా ఫ్లాష్ సేల్ మార్చి 17 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది పరిమిత కాల ఆఫర్ అయినప్పటికీ, మీరు ఓలా స్కూటర్ కొనాలనుకుంటే, డిస్కౌంట్ పొందడానికి మీకు వచ్చే సోమవారం వరకు అవకాశం ఉంది.
దీంతో పాటు, ఓలా తన S1 సిరీస్‌లోని మిగిలిన స్కూటర్లపైనా రూ. 25,000 వరకు తగ్గింపును అందిస్తోంది, ఇందులో S1 థర్డ్ జనరేషన్ (Ola S1 Gen 3 Electric Scooters) రేంజ్‌లోని అన్ని స్కూటర్లు ఉన్నాయి. ఈ తగ్గింపు తర్వాత వాటి ధరలు రూ. 69,999 నుంచి రూ. 1,79,999 మధ్య ఉంటుంది.
ఓలా ఆఫర్ ఇక్కడితో ఐపోలేదు, రూ. 10,500 వరకు విలువైన అదనపు బెనిఫిట్స్ కూడా ఇస్తోంది. అంటే.. S1 Gen 2 స్కూటర్‌ను కొనుగోలు చేసే కొత్త కస్టమర్‌లు ఒక సంవత్సరం పాటు ఉచితంగా Move OS+ను పొందగలరు. ఇది కాకుండా, రూ. 14,999 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీ రూ. 7,499 కే లభిస్తుంది. ఓలా జెన్ 3 పోర్ట్‌ఫోలియోలో... రూ. 1,85,000 ధరకు S1 Pro+ 5.3kWh బ్యాటరీ సామర్థ్యంతో & రూ. 1,59,999 ధరకు S1 Pro+ 4kWh బ్యాటరీ సామర్థ్యంతో స్కూటర్లు ఉన్నాయి.
S1 సిరీస్ ఉత్పత్తుల ధర
S1 Proలో 4kWh & 3kWh సామర్థ్యంతో రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి, వాటి ధరలు వరుసగా రూ. 1,54,999 & రూ. 1,29,999. S1 X సిరీస్ ధరలు 2kWh బ్యాటరీ సామర్థ్యానికి 89,999 రూపాయలు; 3kWh బ్యాటరీ సామర్థ్యానికి 1,02,999 రూపాయలు & 4kWh బ్యాటరీ సామర్థ్యానికి 1,19,999 రూపాయలు. S1 X+ 4kWh బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుంది, దీని ధర 1,24,999 రూపాయలు.
S1 X జనరేషన్ 2 స్కూటర్లు 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి, వీటి ధరలు వరుసగా రూ. 1,49,999, రూ. 84,999, రూ. 97,999 & రూ. 1,14,999 నుంచి ప్రారంభమవుతాయి.
2025-26 మొదటి త్రైమాసికంలో బ్రేక్-ఈవెన్ సాధించగలమని, ఖర్చులు తగ్గించే కార్యక్రమం ద్వారా నెలకు రూ. 90 కోట్లు ఆదా అవుతుందని ఓలా గతంలో ప్రకటించింది.