Kakinada latest News: పిల్లలకు భవిష్యత్‌పై భరోసా కల్పించి వారిని ప్రయోజకులను చేయాల్సిన తండ్రే వారి ప్రాణాలు తీశాడు. దానికి ఆయన చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది. పోటీ ప్రపంచంలో బాగా రాణించలేరని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సూసైడ్ లెటర్ కూడా రాశారు. హోలీ రజు జరిగిన దారుణం చూసి అంతా షాక్ అయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎకౌంటెంట్. ఉండేది కాకినాడ జిల్లా వాకలపూడి. ఆయనకు ఇద్దరు పిల్లలు ఒకరు జోషిల్. ఏడేళ్లు ఒకటో తరగతి చదువుతున్నాడు. రెండోవాడు నిఖిల్. అతనికి ఆరేళ్లు. యూకేజీ చదువుతున్నాడు.
హోలీ సందర్భంగా ఆఫీస్‌లో జరిగే వేడుకలకు ఫ్యామిలీతో హాజరయ్యాడు. కాసేపు అక్కడ ఉన్న చంద్రకిశోర్ సడెన్‌గా పని ఉందని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేశాడు. ఎక్కడికి వెళ్తున్నారని భార్య అడిగితే పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించాలని చెప్పాడు. అలా వెళ్లిన భర్త ఎంతసేపటికీ రాకపోవడంతో ఆయన తో పని చేసే వారి సాయంతో ఇంటికి వచ్చేసింది భార్య.
ఇంటికి వచ్చి చూసిన చంద్రకిశోర్ భార్య ఇంటి తలుపులు లోపలికి వేసి ఉండటం చూసి షాక్ అయ్యింది. భర్త తనకు తెలియకుండా ఇంటికి ఎప్పుడు వచ్చారని కిటిలోంచి చూసింది. అక్కడ భర్త ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్నాడు కంగారు పడ్డ ఆమె తోటి వారి సాయంతో తలుపులు పగలగొట్టి లోపిలికి ఎంటర్ అయ్యింది.
లోపలికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే పని జరిగింది. ఇద్దరి పిల్లల్ని కాళ్లు చేతులు కట్టేసి నీటి బకెట్లో వారిని ముంచి చంపేశాడు చంద్రకిశోర్. పక్కనే ఓ సూసైడ్ నోట్ కూడా ఉంది. దాన్ని చదివిని వారంతా మరింతో షాక్‌కి గురయ్యారు.
చంద్రకిశోర్ తన సూసైడ్ నోట్‌లో తన పిల్లల గురించి రాశాడు. తన పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో బతకలేరని వాటిని తట్టుకునే సామర్థ్యం వాళ్లకు లేదని అందుకే వారిని చంపేసిన తాను కూడా చచ్చిపోతున్నట్టు పేర్కొన్నాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టానికి పంపించారు. పవిత్రమైన హోలీ రోజు అపోహలతో ఇద్దరు పిల్లల్ని చంపడం తనూ సూసైడ్ చేసుకున్న దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది.