NCLT approves Gayatri Projects settlement plan from promoters:  ప్రముఖ తెలుగు రాజకీయ నేతల్లో ఒకరు అయిన టి. సుబ్బారెడ్డి కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీకి బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించాయి.  హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్  గాయత్రీ ప్రాజెక్ట్స్ ప్రమోటర్లు సమర్పించిన రూ.  2,400 కోట్ల వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS) ప్లాన్‌ను ఆమోదించింది. ఈ ప్లాన్ ద్వారా కెనరా బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతలకు రూ. 8,100 కోట్ల బకాయిలకు బదులు రూ. 2400 కోట్లు చెల్లించి విముక్తలవుతారు. కంపెనీని మళ్లీ సొంతం చేసుకుంటారు. 

Continues below advertisement

ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ ,  కన్‌స్ట్రక్షన్ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీని మాజీ రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామి రెడ్డి , అతని కుటుంబం ప్రమోట్ చేశారు. చాలా ప్రాజెక్టులను చేపట్టి బ్యాంకుల నుంచి రూ. 8100 కోట్ల రుణాలను తీసుకున్నారు. కానీ వాటిని చెల్లించలేకపోయారు.  గాయత్రీ ప్రాజెక్ట్స్ 2015లో మొదటిసారి రుణాల రీస్ట్రక్చరింగ్ ప్రయత్నం చేసింది, అది విఫలమైంది.  కొన్ని బ్యాంకులు కంపెనీ షేర్లను ఓపెన్ మార్కెట్‌లో విక్రయించాయి. తర్వాత కంపెనీ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కారణంగా ప్రస్తుతం కంపెనీ షేర్ల ట్రేడింగ్ నిలిపివేశారు. 

 ఇండోర్ దేవాస్ టోల్‌వేస్,  సాయి మాతరిణి టోల్‌వేస్ వంటి ప్రాజెక్ట్‌లకు జారీ చేసిన గ్యారెంటీలు కూడా బ్యాంకులకు బకాయిలలో భాగంగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్‌లను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది.  ఆర్బిట్రేషన్ క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. కంపెనీని, కంపెనీ ఆస్తుల్ని  విక్రయించేందుకు కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చివరికి సుబ్బరామిరెడ్డి కుటుంబసభ్యులే ఓ ఓటీఎస్ స్కీమ్ తో ఎన్సీఎల్టీలో ప్రతిపాదన పెట్టారు.  ప్రమోటర్లు రూ.750 కోట్ల ఫండ్-బేస్డ్ ఎక్స్‌పోజర్‌ను చెల్లించడానికి . రుణదాతలు జారీ చేసిన బ్యాంక్ గ్యారెంటీల ఇన్వొకేషన్‌ను కవర్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.   97% రుణదాతలు ఈ ప్రమోటర్ సెటిల్‌మెంట్ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. NCLT ఆదేశాలతో, ప్రమోటర్లకు రూ.750 కోట్లు చెల్లించడానికి 90 రోజుల వ్యవధి  ఇచ్చారు.  అదనంగా, కంపెనీకి రావలసిన ఆర్బిట్రేషన్ క్లెయిమ్‌ల నుంచి రూ. 450 కోట్లు రుణదాతలకు చెల్లిస్తారు.  ప్రమోటర్లు రూ. ₹45 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ కమిషన్‌లను కూడా చెల్లిస్తారు. రూ.  1,100 కోట్ల గ్యారెంటీలలో ఏవైనా ఇన్వొకేషన్‌లకు కవర్ అందిస్తారు.  ప్రమోటర్లు ఇప్పటికే రూ. 115 కోట్లను రుణదాతల వద్ద డిపాజిట్ చేశారు. మిగిలిన నగదు చెల్లింపులు ఆస్తుల మానిటైజేషన్ ,  ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల ద్వారా చేయబడతాయి. కంపెనీకి హామీగా ఉన్న 13 ఆస్తులలో ఏడు ఆస్తులను విక్రయించడానికి బ్యాంకులు రిలీజ్ చేస్తాయి. 

Continues below advertisement

రుణదాతలకు ఈ సెటిల్‌మెంట్ ద్వారా వారి  రూ.8,100 కోట్ల బకాయిలలో కేవలం 30 శాతం  మాత్రమే రికవరీ సాధ్యమవుతుంది. గత మూడేళ్లలో కంపెనీని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారుని కనుగొనడంలో విఫలమైనందున, ఈ సెటిల్‌మెంట్ ప్రస్తుతం  ఉత్తమం అని బ్యాంకులుభావిస్తున్నాయి.  కెనరా బ్యాంక్ 24 శాతం రుణంతో ప్రధాన రుణదాతగా ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా  , పంజాబ్ నేషనల్ బ్యాం ,   IDBI బ్యాంక్  ఇతర రుణదాతలుగా ఉన్నాయి.  ఈ బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో 30 శాతం మాత్రమే తిరిగి వస్తున్నాయి.