Sai Durgha Tej's Sambarala Yeti Gattu Movie Release Postponed: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సంబరాల ఏటిగట్టు' రిలీజ్ వాయిదా పడింది. ఈ మేరకు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Continues below advertisement

అసలు రీజన్ ఏంటంటే?

నిజానికి ఈ మూవీ ఈ నెల 25న రిలీజ్ చేస్తామని అప్పట్లోనే  మూవీ టీం ప్రకటించింది. అయితే, పవన్ కల్యాణ్ 'OG' మూవీ రిలీజ్ అదే రోజున ఉండడంతో వాయిదా పడుతుందని అంతా భావించారు. ఇప్పుడు తాజాగా మూవీ సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడం ఇతర కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. ''సంబరాల ఏటిగట్టు' మా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి. పవర్ ఫుల్ స్టోరీని ప్రపంచ స్థాయి టెక్నికల్ ప్రమాణాలతో బెస్ట్‌గా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం.

Continues below advertisement

ఊహించని స్ట్రైక్, కొన్ని కీలక CG పనుల కారణంగా ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సినిమా విడుదల తేదీ వాయిదా వేయాలని నిర్ణయించాం. మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎంతో డెడికేషన్‌తో ఈ ప్రాజెక్టు కోసం శ్రమిస్తున్నారు. అలాగే మా డైరెక్టర్ రోహిత్ కెపి తన డ్రీమ్ ప్రాజెక్టును సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఎంతో నిబద్ధతో ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ అవుట్‌పుట్ అందించేందుకు మేము ఎక్కడా రాజీ పడడం లేదు. మూవీ స్టార్టింగ్ నుంచి మాకు సపోర్ట్ చేస్తోన్న మీడియా మిత్రులకు, ఆడియన్స్‌కు కృతజ్ఞతలు. ఫ్యూచర్‌లో మీకు గుర్తుండిపోయే మూవీని అందిస్తాం. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం.' అంటూ రాసుకొచ్చారు.

Also Read: 'కల్కి' సీక్వెల్ నుంచి తీసేశాక దీపికా ఫస్ట్ పోస్ట్ - షారుక్ మూవీ కోసం ప్రభాస్ సినిమా వదులుకున్నారా?

సాయి తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మూవీ 'సంబరాల ఏటిగట్టు'. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో, లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ సరికొత్త ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సిక్స్ ప్యాక్ లుక్‌తో సాయి తేజ్ ఆకట్టుకుంటున్నాడు. యాక్షన్ సీక్వెన్స్, సాంగ్స్ కోసం భారీ సెట్స్‌ను వేయగా... 90 శాతం షూటింగ్ ఆ సెట్స్‌లోనే కంప్లీట్ చేశారు. ప్రస్తుతం CG వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూవీలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా... బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో మూవీని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.