NBK Rings The Bell At NSE :టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సెరిమోనియల్ బెల్ మోగించారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ అధికారులు ఈ గౌరవాన్ని కల్పించారు. ఇలాంటి అవకాశం పొందిన మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా బాలక-ష్ణ నిలిచారు. ఈ ఈవెంట్ సోమవారం ముంబై NSE కార్యాలయంలో జరిగింది.
నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఇండో-అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా విశేషంగా సేవలు అందిస్తున్నారు. NSE అధికారులు అతన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ సమయంలో బెల్ మోగించే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా NBK NSE అధికారులతో సమావేశమై, బెల్ రింగ్ చేసి ట్రేడింగ్ సెషన్‌ను ప్రారంభించారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. NBK అభిమానులు దీనిని "నటసింహం"కు లభించిన మరో గౌరవంగా భావిస్తున్నారు. గతంలో పలువురు బాలీవుడ్ స్టార్స్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు NSE బెల్ మోగించినప్పటికీ, దక్షిణాది నటుల్లో మొదటి వ్యక్తిగా బాలకృష్ణ నిలిచారు.
NSE అధికారులు బాలకృష్ణ సినిమా, రాజకీయ, సామాజిక సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించారు. ముఖ్యంగా, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా చేస్తున్న సేవలు ఈ ఆహ్వానానికి కారణం. గతంలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఇలాంటి గౌరవాలు పొందారు, కానీ సౌత్ నుండి ఇది మొదటి హీరో.