Best Mutual Funds: షేర్ మార్కెట్‌లో చాలా హెచ్చుతగ్గులు చూస్తున్నాం. అందుకే  వీటి  నుంచి తప్పించుకొని సేఫ్‌ పెట్టుబడి కోసం చాలా మంది చూస్తున్నారు.  అలాంటి వాళ్లకోసం మ్యూచువల్ ఫండ్స్  మంచి ఎంపిక కావచ్చు. కానీ సరైన స్కీమ్ ఎంచుకోవడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా కొత్త స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ పెట్టుబడి అవుతుంది. అందుకే ఈ సెక్టార్‌లో టాప్‌లో ఉన్న 5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల గురించి ఇక్కడ చూడొచ్చు. 

మ్యూచువల్ ఫండ్ 5 సెక్టార్లు పరిశీలించి ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాం. ఇందులో ఫ్లెక్సి క్యాప్, ELSS టాక్స్ సేవర్, మిడ్ క్యాప్, సెక్టోరియల్ ఫండ్, స్మాల్ క్యాప్ ఉన్నాయి. ఈ స్కీమ్‌ల ఎంపిక వాటి 5 సంవత్సరాల రిటర్న్‌ల ఆధారంగా ఈ వివరాలు ఇస్తున్నాం. 

1- Quant Flexi Cap Fundఈ స్కీమ్ 5 సంవత్సరాల్లో 35.56 శాతం రిటర్న్ ఇచ్చింది. మీరు ప్రతి నెలా 10,000 SIP చేసి ఉంటే, 6 లక్షల పెట్టుబడి 10,70,024 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు 4.7 లక్షల నేరుగా లాభం, అది కూడా షేర్ మార్కెట్ పతనం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు.  

2- Quant ELSS Tax Saver Fundఈ స్కీమ్ ELSS టాక్స్ సేవింగ్ విభాగంలో టాప్‌లో ఉంది. 5 సంవత్సరాల్లో ఈ ఫండ్ 35.81 శాతం రిటర్న్ ఇచ్చింది. అంటే మీరు ఈ ఫండ్‌లో 6 లక్షల SIP చేస్తే ఐదు సంవత్సరాల తరువాత అది 10,30,647 రూపాయలు అవుతుంది. అంటే టాక్స్ మినహాయింపుతోపాటు అద్భుతమైన వృద్ధి సౌకర్యం ఉంటుంది. 

3- Motilal Oswal Mid Cap FundQuantలో దూసుకెళ్లేది Motilal Oswal Mid Cap Fund మాత్రమే. ఇది 5 సంవత్సరాలలో 37.17 శాతం రిటర్న్ ఇచ్చింది. అంటే ఎవరైనా ఈ ఫండ్‌లో 10,000 నెలవారీ SIPతో 6 లక్షల పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ పెట్టుబడి 5 సంవత్సరాల తరువాత 12,90,735 రూపాయలు అవుతుంది. అంటే రెట్టింపు కంటే ఎక్కువ రిటర్న్.

4-Quant Infrastructure Fundమీకు సెక్టోరియల్ ఫండ్‌లో ఆసక్తి ఉంటే, ఈ స్కీమ్ కచ్చితంగా బాగా నచ్చుంది. 5 ఏళ్లలో ఈ ఫండ్ 41.49 శాతం రిటర్న్ ఇచ్చింది. అంటే SIP ద్వారా ఎవరైనా ఈ ఫండ్‌లో ఐదు సంవత్సరాలకు 6 లక్షల పెట్టుబడి పెట్టి ఉంటే అది 11,63,810 రూపాయలు అవుతుంది.

5- Quant Small Cap FundQuant Small Cap Fund 5 సంవత్సరాలలో 48.26 శాతం రిటర్న్ ఇచ్చింది. ప్రతి నెలా 10,000 SIP చేస్తే 12,61,047 రూపాయలు అవుతాయి. అంటే ఒకే స్కీమ్‌లో 6.6 లక్షల నేరుగా లాభం!

ఈ 5 స్కీమ్‌లలో నాలుగు స్కీమ్‌లు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ సెక్టార్‌కు చెందినవి. మీరు మంచి పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నట్టైతే క్వాంట్ మీ పోర్ట్‌ఫోలియోలో ఒకటై ఉండాలి. 

గమనిక: (ఇక్కడ అందించిన సమాచారం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి మార్కెట్ పరిస్థితులకు లోబడి ఉంటుంది. పెట్టుబడిదారుడిగా డబ్బు పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహాలు తీుసుకోవడం చాలా అవసరం. ఈ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టమని https://telugu.abplive.com//amp  వైపు నుంచి ఎవరికీ ఎప్పుడూ సలహాలు ఇవ్వబదు.)