Stock Market Closing 02 August 2023:


స్టాక్‌ మార్కెట్లు బుధవారం క్రాష్‌ అయ్యాయి. ఫిచ్‌ రేటింగ్స్‌ అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ను AAA నుంచి AA+కు తగ్గించడం కలకలం సృష్టించింది. రాబోయే మూడేళ్లలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని చెప్పడం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. దాంతో ఆసియా, అంతర్జాతీయ సూచీలు క్రాష్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు ఉదయం నుంచి పానిక్‌ సెల్లింగ్‌కు పాల్పడ్డారు. ఐరోపా మార్కెట్లు తెరిచాక నష్టాలు కాస్త తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 207 పాయింట్లు తగ్గి 19,526 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 676 పాయింట్లు తగ్గి 65,784 వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 32 పైసలు బలహీన పడి 82.58 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.3.5 లక్షల కోట్లమేర సంపద కోల్పోయారు.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)



క్రితం సెషన్లో 66,459 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,064 వద్ద మొదలైంది. 65,431 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,261 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 676 పాయింట్ల నష్టంతో 65,782 వద్ద ముగిసింది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 19,733 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,655 వద్ద ఓపెనైంది. 19,423 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,678 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 207 పాయింట్లు తగ్గి 19,526 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 45,234 వద్ద మొదలైంది. 44,720 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,404 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 596 పాయింట్లు తగ్గి 44,995 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, దివిస్‌ ల్యాబ్‌, హిందుస్థాన్‌ యునీలివర్, ఏసియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, హీరో మోటో కార్ప్‌, టాటా మోటార్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్‌ అండ్ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.77300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.560 తగ్గి రూ.24,550 వద్ద కొనసాగుతోంది.


Also Read: అమెరికాకు 'ఫిచ్‌' రేటింగ్‌ దెబ్బ! US ఎకానమీకి వరుస షాకులు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.