Stock Market Closing Bell 20 July 2022: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ముడిచమురు ధరలు తగ్గడం, క్రూడాయిల్ ఎగుమతి పన్ను తీసేయడంతో సూచీలు భారీగా ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 180 పాయింట్ల లాభంతో 16,520, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 629 పాయింట్ల లాభంతో 55,397 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 79.99గా ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,767 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,486 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 55,298 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,630 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 629 పాయింట్ల లాభంతో 55,397 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 16,340 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,562 వద్ద ఓపెనైంది. 16,490 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,588 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 180 పాయింట్ల లాభంతో 16,520 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 36,061 వద్ద మొదలైంది. 35,876 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,182 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 251 పాయింట్ల లాభంతో 35,972 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, ఐచర్ మోటార్స్, కొటక్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఆటో, మీడియా, రియాల్టీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.