Stock Market Opening Bell on 27 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆరంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. బంగారం ధర స్థిరపడటం, అమెరికన్లు డాలర్‌ను పక్కన పెట్టి స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుండటం, ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఓపెనవ్వడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటు నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,276 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 382 పాయింట్లు లాభపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 54,252 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,671 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. ఆరంభం నుంచే కొనుగోళ్ల ఊపు కనిపించింది. 54,518 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,791 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 382 పాయింట్ల లాభంతో 54,630 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 16,170 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,296 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల్లో ఉంది. 16,253 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,239 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 103 పాయింట్ల లాభంతో 16,276 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం భారీ లాభాల్లో ఉంది. ఉదయం 35,326 వద్ద మొదలైంది. 35,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,536 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 388 పాయింట్ల లాభంతో 35,483 వద్ద ఉంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్‌, ఆసియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ను మినహాయిస్తే అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి.