Stock Market Opening 19 October 2022: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ఓపెనయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అందాయి. దీపావళి సమీపిస్తుండటంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 95 పాయింట్ల లాభంతో 17,582 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 353 పాయింట్ల లాభంతో 59,313 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 58,960 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,196 వద్ద లాభాల్లో మొదలైంది. 59,148 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,399 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 353 పాయింట్ల లాభంతో 59,313 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 17,486 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,568 వద్ద ఓపెనైంది. 17,535 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,607 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 95 పాయింట్ల లాభంతో 17,582 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 40,557 వద్ద మొదలైంది. 40,448 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,643 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 210 పాయింట్ల లాభంతో 40,529 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, ఇన్ఫీ, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్ నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి. హెల్త్‌కేర్, ఫార్మా, మీడియా, ఐటీ రంగాల సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.