Stock Market Closing 11 October 2022: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. ప్రాంతీయ రాజకీయాలు మదుపర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మధ్యాహ్నం వరకు న్యారో రేంజ్‌లో కదలాడిన సూచీలు ఆఖర్లో ఒక్కసారిగా పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 257 పాయింట్ల నష్టంతో 16,983 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 843 పాయింట్ల నష్టంతో 58,147 వద్ద ముగిశాయి. మదుపర్లు నేడు రూ.4 లక్షల కోట్ల మేర సంపద నష్టపోయారు. క్రితం ముగింపు రూ.82.32తో పోలిస్తే రూపాయి నేడు ఫ్లాట్‌గా అదే స్థాయి వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,991 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,004 వద్ద నష్టాల్లో మొదలైంది. 57,050 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,027 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 843 పాయింట్ల నష్టంతో 57,147 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,241 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,256 వద్ద ఓపెనైంది. 16,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,261 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 257 పాయింట్ల నష్టంతో 16,983 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,058 వద్ద మొదలైంది. 38,622 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,174 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 380 పాయింట్ల నష్టంతో 38,712 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 3 కంపెనీలు లాభాల్లో 47 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక శాతం కన్నా ఎక్కువే పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.