Stock Market Closing Bell 13 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఉదయం లాభాల్లోనే మొదలైన సూచీలు ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు బలహీనంగా ఉండటంతో నేలచూపులు చూశాయి. మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 91 పాయింట్ల నష్టంతో 16,966, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 372 పాయింట్ల నష్టంతో 53,514 వద్ద ముగిశాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 53,886 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,210 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 53,455 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,211 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 372 పాయింట్ల నష్టంతో 53,514 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే  ఒకానొక దశలో 500 పాయింట్లు లాభపడ్డ సూచీ ఆఖరికి నష్టాల్లోకి జారుకుంది.   


NSE Nifty


మంగళవారం 16,058 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,128 వద్ద ఓపెనైంది. 15,950 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,140 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 91 పాయింట్ల నష్టంతో 15,966 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,259 వద్ద మొదలైంది. 34,757 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,308 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 304 పాయింట్ల నష్టంతో 34,827 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, సిప్లా, గ్రాసిమ్‌ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ నష్టపోయాయి. కన్జూమర్‌ డ్యురబుల్స్‌, హెల్త్‌కేర్‌, రియాల్టీ, ఫార్మా, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ రంగాల సూచీలు ఎగిశాయి. ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పతనమయ్యాయి.