Stock Market Closing 12 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడ్డారు. చివరికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 3 పాయింట్లు తగ్గి 19,993 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 94 పాయింట్లు తగ్గి 67,221 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లు జోరుమీదున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 67,127 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 67,506 వద్ద మొదలైంది. 66,948 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,539 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 94 పాయింట్ల లాభంతో 67,221 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,996 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 20,110 వద్ద ఓపెనైంది. 19,914 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,110 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 3 పాయింట్లు తగ్గి 19,993 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ ఎరుపెక్కింది. ఉదయం 45,893 వద్ద మొదలైంది. 45,322 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,893 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 59 పాయింట్ల నష్టంతో 45,511 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్ (2.64%), ఎల్‌టీ (1.88%), ఇన్ఫీ (1.66%), అల్ట్రాటెక్ సెమ్ (1.43%), డాక్టర్ రెడ్డీస్ (1.41%) షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్ (3.79%), ఎన్టీపీసీ (3.60%), పవర్‌గ్రిడ్ (3.25%), అదానీ ఎంటర్‌ప్రైజైస్ (3.17%), కోల్ ఇండియా (3.08%) షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేమీ లేవు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,830 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.23,830 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలిసారి 20,000 మార్క్‌ను అందుకుంది. చివరి గరిష్ఠమైన 19,991ను అధిగమించేందుకు 36 సెషన్లు పట్టింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినా.. జీ20 సమావేశాలు ఇచ్చిన కిక్కుతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. మొత్తంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 176 పాయింట్లు పెరిగి 19,996 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 528 పాయింట్లు పెరిగి 67,127 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 83.03 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.