Stock Market Opening 05 October 2023:


భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. వరుస పతనానికి నేడు తెరపడింది. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం మార్కెట్‌ వర్గాల్లో సంతోషం నింపింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 124 పాయింట్లు పెరిగి 19,560 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 473 పాయింట్లు ఎగిసి 65,699 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,226 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,598 వద్ద మొదలైంది. 65,443 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,753 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 473 పాయింట్లు పెరిగి 65,699 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 19,436 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,521 వద్ద ఓపెనైంది. 19,487 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,576 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 124 పాయింట్లు పెరిగి 19,560 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 44,181 వద్ద మొదలైంది. 44,108 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,391 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 382 పాయింట్ల లాభంతో 44,346 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. టైటాన్‌, ఇన్ఫీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, దివిస్‌ ల్యాబ్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 తగ్గి రూ.57,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.70,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.23,250 వద్ద ఉంది.


క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?


భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్లోనూ పతనం కొనసాగింది. క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ ఇండెక్స్‌, వినియోగ ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంటు పెంచాయి. వీటికి తోడు ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ముఖ్యంగా బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లు విలవిల్లాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 92 పాయింట్లు తగ్గి 19,436 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 286 పాయింట్లు తగ్గి 65,226 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.



Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.