Stock Market @12 PM, 20 July 2023:


స్టాక్‌ మార్కెట్లు గురువారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగుతున్నాయి. సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్న సూచీలు కన్సాలిడేట్‌ అవుతున్నాయి.  గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 8 పాయింట్లు పెరిగి 19,841 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 5 పాయింట్లు తగ్గి 67,091 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ, పవర్‌, ఆటో సెక్టార్ల సూచీలు ప్రెజర్లో ఉన్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 67,097 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,074 వద్ద మొదలైంది. 66,831 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,120 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 5 పాయింట్ల నష్టంతో 67,091 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 19,833 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,841 వద్ద ఓపెనైంది. 19,758 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,847 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 8 పాయింట్లు పెరిగి 19,841 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,689 వద్ద మొదలైంది. 45,640 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,773 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 65 పాయింట్లు పెరిగి 45,734 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, రిలయన్స్‌, సిప్లా, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, అల్ట్రాటెక్‌ సెమ్‌, హీరోమోటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎం అండ్‌ ఎం నష్టపోయాయి. ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పెరిగాయి. 


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.60,750 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.78,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.25,630 వద్ద ఉంది.


Also Read: నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు 90 రెట్లు బిడ్లు! లిస్టింగ్‌ మామూలుగా ఉండదిక!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial