Stock Market Opening 02 February 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, కంపెనీలపై బడ్జెట్ ప్రభావాన్ని మదుపర్లు తెలుసుకుంటున్నారు. ఫలితంగా కొన్ని షేర్లు లాభాల్లో, కొన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు జోష్‌లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్ల నష్టంతో 17,570 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 5 పాయింట్ల లాభంతో 59,713 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీసీకి గిరాకీ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,708 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,459 వద్ద మొదలైంది. 59,215 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,924 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 5 పాయింట్ల లాభంతో 59,713 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,616 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,517 వద్ద ఓపెనైంది. 17,445 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,653 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 45 పాయింట్ల నష్టంతో 17,570 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 39,943 వద్ద మొదలైంది. 39,761 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,678 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 257 పాయింట్లు తగ్గి 40,255 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టపోయాయి. ఐటీసీ, బ్రిటానియా, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ గ్రూప్ స్టాక్స్: గత కొన్ని సెషన్లుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ అమ్మకాలను చూశాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు రూ. 12 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. చాలా స్టాక్‌ల వ్యూ బేరిష్‌గా ఉంది. అవన్నీ రీబౌండ్ సాధించగలవో, లేదో అర్ధం చేసుకోవడం చాలా కీలకం.
బ్రిటానియా ఇండస్ట్రీస్: ఈ కంపెనీ, 2022 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 932 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 150% పెరిగింది. ఏకీకృత విక్రయాలు 16% వృద్ధితో రూ. 4,101 కోట్లకు చేరుకోగా, నిర్వహణ లాభం 55% పెరిగి రూ. 760 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.