Stock Market Closing 30 December 2022: 


భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందడంతో మొదట్లో సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి. ఐరోపా మార్కెట్లు మొదలవ్వగానే నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్ల నష్టంతో 18,105 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 293 పాయింట్ల నష్టంతో 60,840 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలపడి 82.72 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 61,133 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,329 వద్ద మొదలైంది. 60,743 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,392 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 293 పాయింట్ల నష్టంతో 60,840 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 18,191 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,259 వద్ద ఓపెనైంది. 18,080 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,265 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 85 పాయింట్ల నష్టంతో 18,105 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,401 వద్ద మొదలైంది. 42,833 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,422 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 265 పాయింట్లు తగ్గి 43,401 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఫైనాన్స్‌, టైటాన్‌, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్‌, గ్రాసిమ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.