Stock Market Closing 16 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లలో శుక్రవారం రక్తకన్నీరు ప్రవహించింది. బెంచ్‌మార్క్‌ సూచీలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, డాలర్‌ విలువ పెరుగుదల, ఐటీ షేర్ల విక్రయాలు, భారత వృద్ధిరేటులో స్వల్ప కోత, ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరల పెరుగుదల మదుపర్ల సెంటిమెంటును గాయపరిచింది. వారు ఈ ఒక్కరోజే రూ.6 లక్షల కోట్ల సంపద నష్టపోయారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 346 పాయింట్ల నష్టంతో 17,530 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1093 పాయింట్ల నష్టంతో 58,840 వద్ద ముగిశాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 59,934 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,585 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 58,687 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,720 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1093 పాయింట్ల నష్టంతో 58,840 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1250 పాయింట్ల మేర నష్టపోయిన సూచీ ఆఖర్లో కాస్త తేరుకుంది.


NSE Nifty


గురువారం 17,887 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,698 వద్ద ఓపెనైంది. 17,497 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,820 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 346 పాయింట్ల నష్టంతో 17,530 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ఉదయం 40,977 వద్ద మొదలైంది. 40,502 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,162 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 432 పాయింట్ల నష్టంతో 40,776 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా షేర్లు మాత్రమే లాభపడ్డాయి. యూపీఎల్‌, టాటా కన్జూమర్స్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఇన్ఫీ భారీగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, ఆటో, మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఏకంగా 2-4 శాతం మేర పతనమయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.