Stock Market Closing 14 August 2023:


స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అమెరికా టెక్‌ కంపెనీల పతనం వల్ల అన్ని దేశాల మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. నగదు నిల్వల శాతం పెంచాలని ఆర్బీఐ చెప్పడంతో బ్యాంకింగ రంగ షేర్లు కుప్పకూలాయి. అయితే ఆఖరి అరగంటలో సూచీలు రీబౌండ్‌ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 7 పాయింట్లు పెరిగి 19,434 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 79 పాయింట్లు ఎగిసి 65,401 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలహీనపడి 82.95 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,322 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,153 వద్ద మొదలైంది. 64,821 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,517 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 79 పాయింట్ల లాభంతో 65,401 వద్ద ముగిసింది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,428 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,383 వద్ద ఓపెనైంది. 19,257 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,465 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 7 పాయింట్లు పెరిగి 19,434 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,066 వద్ద మొదలైంది. 43,776 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,212 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 108 పాయింట్లు తగ్గి 44,090 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, ఇన్ఫీ, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హిందుస్థాన్‌ యునీలివర్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా సూచీలు పెరిగాయి. ఆటో, ఫైనాన్స్‌, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,620 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.3200 తగ్గి రూ.73000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.24,200 వద్ద ఉంది.


Also Read: 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.