Stock Market Closing 05 May 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ 4 శాతం నష్టపోయాయి. వారంతం కావడంతో మదుపర్లు విపరీతంగా అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 186 పాయింట్లు తగ్గి 18,069 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 694 పాయింట్లు తగ్గి 61,054 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 81.78 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,749 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,163 వద్ద మొదలైంది. 61,002 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,585 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 694 పాయింట్ల నష్టంతో 61,054 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,255 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,117 వద్ద ఓపెనైంది. 18,055 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,216 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 186 పాయింట్లు తగ్గి 18,069 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,110 వద్ద మొదలైంది. 42,582 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,588 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1024 పాయింట్లు తగ్గి 42,661 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. టైటాన్, మారుతీ, అల్ట్రాటెక్ సెమ్, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, ప్రైవేటు బ్యాంక్ ఎక్కువ నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.62,400గా ఉంది. కిలో వెండి రూ.1150 పెరిగి రూ.78,250 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.27,440 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.