Stock Market Closing 03 May 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం రేంజ్ బౌండ్‌గా కదలాడాయి. చివరికి స్వల్ప నష్టాల్లోనే ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 49 పాయింట్లు తగ్గి 18,098 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 161 పాయింట్లు తగ్గి 61,193 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలపడి 81.82 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,354 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,274 వద్ద మొదలైంది. 61,024 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,274 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 161 పాయింట్ల నష్టంతో 61,193 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 18,147 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,113 వద్ద ఓపెనైంది. 18,042 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,116 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 49 పాయింట్లు తగ్గి 18,098 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,154 వద్ద మొదలైంది. 43,078 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,354 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని డడడడడడడడఅందుకుంది. ఆఖరికి 26 పాయింట్లు తగ్గి 43,325 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ యునీలివర్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఓఎన్‌జీసీ, యూపీఎల్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియాల్టీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపెక్కాయి. ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.880 పెరిగి రూ.61,640గా ఉంది. కిలో వెండి రూ.700 పెరిగి రూ.76,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 పెరిగి రూ.27,580 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.