Stock Market @12 PM, 18 May 2023: 


స్టాక్‌ మార్కెట్ల వరు నష్టాలకు తెరపడింది. గురువారం మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 60 పాయింట్లు పెరిగి 18,242 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 267 పాయింట్లు ఎగిసి 61,824 వద్ద కొనసాగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు జోరు మీదున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,560 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,937 వద్ద మొదలైంది. 61,687 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,955 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 267 పాయింట్ల లాభంతో 61,824 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 18,181 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,287 వద్ద ఓపెనైంది. 18,213 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,297 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 60 పాయింట్లు పెరిగి 18,242 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,006 వద్ద మొదలైంది. 43,844 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,079 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 257 పాయింట్లు ఎగిసి 44,055 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. దివిస్‌ ల్యాబ్‌, అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐచర్‌ మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ నష్టపోయాయి. ఆటో, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.61,200గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.78,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 పెరిగి రూ.28,300 వద్ద ఉంది.


Also Read: హైదరాబాద్‌ జనం ఇళ్లను ఈజీగా కొని పడేస్తున్నారు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.