Stock Market @ 12 PM, 16 December 2022:


భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మాంద్యంలోకి పయనిస్తోందన్న వార్తలు మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. మరోవైపు చైనాలో కొవిడ్‌ కేసులు పెరగడం భయపెడుతోంది. ఫలితంగా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 190 పాయింట్ల నష్టంతో 18,230 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 555 పాయింట్ల నష్టంతో 61,250 వద్ద కొనసాగుతున్నాయి. ఈ ఒక్కరోజే మదుపర్లు రూ.2.50 లక్షల కోట్ల డబ్బు నష్టపోయారు.


BSE Sensex


క్రితం సెషన్లో 61,806 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,608 వద్ద మొదలైంది. 61,102 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,612 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 555 పాయింట్ల నష్టంతో 61,250 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


సోమవారం 18,420 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,340 వద్ద ఓపెనైంది. 18,202 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,355 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 190 పాయింట్ల నష్టంతో 18,230 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ నష్టాల్లో ఉంది. ఉదయం 43,152 వద్ద మొదలైంది. 42,955 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,350 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 376 పాయింట్లు పతనమై 43,037 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, టీసీఎస్‌ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, ఐచర్‌ మోటార్స్‌, యూపీఎల్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.