Stock Market @12 PM, 11 May 2023:  


స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. హై లెవల్స్‌లో కన్సాలిటేడ్‌ అవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. ఫార్మా కంపెనీల షేర్లు విలవిల్లాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 12 పాయింట్లు పెరిగి 18,327 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 52 పాయింట్లు ఎగిసి 61,992 వద్ద ఉన్నాయి. అదానీ కంపెనీల షేర్లు జోష్‌లో ఉన్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,940 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,940 వద్ద మొదలైంది. 61,868 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,168 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 52 పాయింట్ల లాభంతో 61,992 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 18,315 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,357 వద్ద ఓపెనైంది. 18,289 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,389 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 12 పాయింట్లు పెరిగి 18,327 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,535 వద్ద మొదలైంది. 43,367 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,774 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 213 పాయింట్లు పెరిగి 43,544 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌టీ, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.62,130గా ఉంది. కిలో వెండి రూ.400 తగ్గి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1090 పెరిగి రూ.29,260 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.