Best Mutual Funds To Invest In 2024: స్టాక్ మార్కెట్‌లోని రిస్క్‌ను పరిమితం చేసే మార్గాల్లో మ్యూచువల్ ఫండ్స్ (MFs) ఒకటి. ఒక వ్యక్తి నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టకుండానే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయగలగడం మ్యూచువల్ ఫండ్స్‌తో సాధ్యం. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఫండ్ మేనేజర్ ఉంటాడు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలను అనుభవజ్ఞుడైన ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు కాబట్టి, రిస్క్ తక్కువగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వంటి వర్గాలుంటాయి. మళ్లీ వీటిలో వివిధ ఉప వర్గాలు ఉంటాయి. ఒక పెట్టుబడిదారుకు, తాను తీసుకోగల రిస్క్, ఆర్థిక లక్ష్యంపై స్పష్టత ఉండాలి. తాను పరిశీలించే ఫండ్ గత 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో ఎంత రిటర్న్ డెలివెరీ చేసిందో తెలుసుకోవాలి. ఫండ్ మేనేజర్ అనుభవాన్ని అర్ధం చేసుకోవాలి. ఈ లెక్కల ఆధారంగా ఫండ్‌ను ఎంచుకోవాలి. ఏ ఫండ్‌లోనైనా క్రమశిక్షణతో మదుపు చేస్తే దీర్ఘకాలంలో రిస్క్ చాలా తగ్గుతుంది, పెద్ద సంపద పోగుపడుతుంది.
2024లో స్టాక్ మార్కెట్ మంచి బూమ్‌లో ఉంది కాబట్టి, ఈ ఏడాదిని మ్యూచువల్ ఫండ్స్‌కు రివార్డింగ్ టైమ్ అని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
గత ఏడాది కాలంలో మంచి పనితీరు కనబర్చిన మ్యూచువల్ ఫండ్స్:
లార్జ్ క్యాప్ ఫండ్స్
క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్: 49.24% రిటర్న్. అంటే, ఒక ఏడాది కాలంలోనే రూ.లక్ష రూపాయల పెట్టుబడిపై రూ.49 వేలకు పైగా లాభం వచ్చింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూచిప్ ఫండ్: 39.10% రిటర్న్
జేఎం లార్జ్ క్యాప్ ఫండ్: 38.25% రిటర్న్
టౌరస్ లార్జ్ క్యాప్ ఫండ్: 36.72% రిటర్న్
నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్: 36.10% రిటర్న్
మిడ్ క్యాప్ ఫండ్స్
క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్: 60.24% రిటర్న్
మహీంద్ర మనులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్: 58.59% రిటర్న్
జేఎం మిడ్ క్యాప్ ఫండ్: 57.90% రిటర్న్
HDFC మిడ్ క్యాప్ అపార్చునిటీస్ ఫండ్: 53.75% రిటర్న్
హెచ్‌ఎస్‌బీసీ మిడ్ క్యాప్ ఫండ్: 50.64% రిటర్న్
వాల్యూ ఫండ్స్
క్వాంట్ వాల్యూ ఫండ్: 65.44% రిటర్న్
జేఎం వాల్యూ ఫండ్: 59.08% రిటర్న్
ఏబీఎస్ఎల్ ప్యూర్ వాల్యూ ఫండ్: 54.43% రిటర్న్
నిప్పన్ ఇండియా వాల్యూ ఫండ్: 54.11% రిటర్న్
హెచ్‌ఎస్‌బీసీ వాల్యూ ఫండ్: 50.03% రిటర్న్
గిల్ట్ ఫండ్స్
2024 ద్వితీయార్థంలో RBI వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించన్న అంచనాలు ఉన్నాయి. వడ్డీ రేట్ల తగ్గుదల నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఇవి గవర్నమెంట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే.. గిల్ట్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, అదే స్థాయిలో లాభం కూడా ఉంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోగల, సుదీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టగల పెట్టుబడిదార్లకు మాత్రమే ఇవి సూటవుతాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు గిల్ట్ ఫండ్స్ లాభపడతాయి, రేట్లు పెరిగినప్పుడు ఎక్కువగా నష్టపోతాయి.
ఈ నెలలో (ఏప్రిల్ 2024) పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ గిల్ట్ ఫండ్స్:
నిప్పన్ ఇండియా గిల్ట్ సెక్యూరిటీస్ ఫండ్
బంధన్ జి-సెక్ ఫండ్
SBI మాగ్నమ్ గిల్ట్ ఫండ్
ICICI ప్రుడెన్షియల్ గిల్ట్ ఫండ్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ప్రభుత్వ సెక్యూరిటీస్ ఫండ్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టెస్లా ఉద్యోగులకు లేఆఫ్‌ల టెన్షన్, వేలాది మంది తొలగింపు!